Others

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

452. అనుచు లంఖిణి శూరుని హనుమ నంపె
శత్రు శిరముపైపాదము బెట్టునట్లు
ఎడమ కాలును లంకలో బెట్ట జనక
తనయకు శుభశకునమయ్యె హర్షమొదవె

453.రాజవీధిని జనుచున్న హనుమ వీధు
లందు జల్లిన పరిమళ జలము పుష్ప
సౌరభంబును నాసికా నేత్రములకు
విందు గూర్పగ ధరజను వెదక సాగె

454.తెల్ల మబ్బులవలె వియత్తలము నంటు
సౌధములు నందు జరియించు సుదతుల పద
నూపురధ్వనుల్ మంగళ నృత్య గీత
వాద్యముల వినుచు హరీశు డరుగ దొడగె

455.రాజవీధిలోన నరుగుచు రాక్షస
గృహములన్ని కలయ జూచె హనుమ
మద్యపాన మత్తులై నొకరి నొక్కరు
పరిహసించుకొనుచు ప్రేలువారి

456.వివిధ విద్యల ప్రావీణ్యులనవారి
వేదములు మూడు చక్కగ జదువు వారి
బుద్ధిమంతుల సుజ్ఞాన బుధుల రజని
చరుల రూప సంపన్నులం జూచె హనుమ

457. ఏకకర్ణుల యేక నేత్రముల వారి
ముండిత శిరస్కులను జటామండితులను
కృష్ణ గౌరవర్ణుల వికటంపు ముఖుల
వివిధ రూపుల జూచుచు వెదక సాగె

458.్ధర్మమార్గము నందు వర్తించుపడతు
లర్ధ రాత్రిని భర్తల వద్ద జేరి
పరవశించి నిద్రించెడు వారి జూచె
కమల నయనను వెదకుచు కపివరుండు

459. శత్రు కర్మనుడును మహాసత్వశాలి
వాయుపుత్రుడు పద్మపత్రాయాక్షి
జనకపుత్రిక నరయుచు సాగి సాగి
రావణాసురుడు సౌధప్రాంగణము జేరె

460.రాక్షసేశ్వరు నంతిపురమును జుట్టి
ధవళ పద్మమయ సరస్సు వెలసియుండె
నప్సరల మించు సుదతులు నాలపించు
దివ్యమంజులగానము వినగవచ్చె

461. జోత్స్నకరుడుయించి యాకసము నుండి
లోకవాసుల పాపములను హరించి
సర్వవస్తువులను ప్రకాశింపజేసి
ఆలమందలో వృషభేంద్రు డనగ నొప్పె

462.పసిడి తొడవుల మత్తయి భేంద్రము వలె
మందరాచల గుహను మృగేంద్రు రీతి
రజత పంజరమున రాజహంస రీతి
విజయ మందిన మనుజేంద్రు నోజ వెలిగె

463.శీతకిరణుని కాంతిలో శే్వతమేఘ
మటుల నంబరచుంమితమైన శిఖర
ములలో రావణు నంతిపురమ్ము జూడ
ఇంద్రభవనమ్మును పరిహాసిత మొనర్చె

464.రాక్షసేశ్వరు సౌధ సమీప మందు
నున్న నాతని సహజన్ములైన యసుర
వీరులౌ కుంభకర్ణ విభీషణాది
సోదరుల సౌధముల ననే్వషించి హనుమ

465. వీరవరులగు సేనానులౌ ప్రహస్త
జంబుమాలి సుమాలి మహోదరాది
యతుధానుల గృహముల నింద్రజిత్తు
మందిరమ్మును శోధించె మరల మరల

466.్ధర్మ చారిత్ర సుకుమారి ధరణి పుత్రి
జాడ దెలియక దుఃఖించి యాంజనేయు
డతి సమర్థుడు ధీశాలి తిరిగి తిరిగి
నేర్పుతో పరిశీలన జేయదొడగె

467.మందరాచల సదృశమై మరకతమణి
రత్నరచితమలైన క్రీడా గృహంబు
లుత్తమ స్ర్తిలు నిత్య పూజార్చనములు
సల్పు లంకేశుభవనము న్జొచ్చె హనుమ

468.రక్షణాది కార్యముల సుశిక్షతులగు
ఘోర రూపులు బలపరాక్రములు యసురు
లెందరో రావణాసుర మందిరమ్ము
గాచుచుండిరి యూయుధ పాణులౌచు

టంగుటూరి మహాలక్ష్మి