Others

పనికి ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశం. అన్నివేళలా అందరూ ఆచరింపదగినది. ఈ విషయాన్ని శ్లోకాలలో విపలీకరిస్తూ, అర్జునా! కర్మలనాచరించు వేళల్లో, ఆ కర్మనెట్లు చేయవలెనో, దానిని గూర్చిన వివేకమవసరము. ఆ వివేకమునే బుద్ధి అంటారు. అలాంటి బుద్ధితో గూడి కర్మలనాచరించినచో జీవుడు కర్మబంధనాలలో చిక్కుకొనడు. కర్మచేసిననూ బంధింపబడరాదు. గీతాచార్యుడు 2వ అధ్యాయం 40వ శ్లోకం ద్వారా వివరించారు.
శ్లో॥ నేహాభిక్రమ నాశోస్తి- ప్రత్యవాయోనవిద్యతే
స్వల్ప మప్యస్య ధర్మస్య- త్రాయతే మహతో భయాత్’ అంటూ కర్మయోగం ప్రారంభమైనచో అది నిష్ఫలము కాదు. కానేరదు. అది పూర్తికావడానికి ముందుగా, ఏ కారణం చేతనైనను మధ్యలో నిలిచిననూ దోషములేదు. ఈ కర్మయోగానుష్ఠానము ఒక ధర్మము. ఆ ధర్మమే సంసార భయమునుండి రక్షించుచున్నది.
వివేకముతో గూడిన ఈ కర్మయోగమును ప్రారంభించిననూ వ్యర్థము కానేరదు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది సత్ఫలమును గలుగజేస్తుంది. దీనికొక ఉపమానము పరమాత్మ వివరిస్తూ, విత్తనమును నేలలో నాటిన తరువాత చివరి వరకూ నీరు, ఎరువులచే పోషించిన మాత్రముచే ఫలమును చక్కగా అందిస్తుంది. మధ్యలో నీటిని పోయడం మానివేస్తే ఆ మొలక ఎండిపోయి ఫలితమునివ్వదు. ఎంత చేసిన అంత ఫలమొసంగును కాని, దానివలన దోషమేదీ కలుగదు. ఇదియే నిష్కామకర్మయోగము అని భగవానుడుపదేశించినాడు.
ఈ విశ్వంలో అన్ని భయాలలో గొప్ప భయము జీవులకు మరణ భయము. జనన మరణ రూప సంసార భయము. ఇది తొలగిపోవాలంటే నిష్కామకర్మానుష్ఠానము తప్పనిసరి. ఒక నిప్పురవ్వ ఒక భయంకరమైన అరణ్యమును బూడిదచేసినట్లుగా, చిన్న ఓడ విశాల సముద్రమును దాటించునట్లు నిష్కామకర్మాచరణమే ఒక పరమార్థ సాధనగా జీవులను కాపాడుతుంది.
కర్మానుష్ఠాన పరులు ముందుగా యోగస్థులై, దైవబుద్ధినీ ఆత్మబుద్ధినీ అలవరచుకొని, ధర్మనిర్వహణలో కర్మను నిర్దుష్ఠముగా, నిష్కామముగా ప్రవర్తించి- జ్ఞాన విచారణ, ఆత్మచింతనలో, కర్మయోగ నిర్వహణలో సఫలీకృతులు కావలెనని దీవించి- ఆ ఉపదేశామృతమును త్రాగి విజయుడ వైచరించమని ఆకాంక్షించారు గీతాచార్యులు. కర్మయోగ మహిమను వర్ణించి వివరించుట సమాజ హితమునకేయని సకల జనులూ గుర్తింకోదగిన ధర్మముగా, సత్కర్మముగా భావించి, ఆ రీతిలో చరించి- తరించి- దన్యులుగావాలి. దైవం జూపిన మహనీయ మార్గములో పయనించి సత్ఫలితాలను పొందాలి.

- పి.వి.సీతారామమూర్తి