Others

మువ్వనె్నల పరవశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాషాయం, తెలుపూ
ఆకుపచ్చ కలుపు
పతాకమై పైకెగసిన ప్రతీకలో
ప్రతిసారీ చూడాలొక గెలుపు
త్యాగాల రాగాలతో మార్మ్రోగిన ధరణి
సాహసాల సహవాసం
చెలరేగిన అవని
పోరాటపు ఉగ్గుపాలు
పొంగించిన పౌరుషం
ప్రాణాలే పణంగా
కొనసాగిన ఉద్యమం
ఒక వీరుడి తల..
చిరునవ్వులు రువ్వుతూ
ఉరికొయ్యకు ఊగిందట ఉయ్యాల
ఒక యోధుడి ఎద..
ఎదిరించే నినాదమై
ఎదురొడ్డిందట..
గురిచూసిన తూటాలకి
లాటీలకు ఆయాసం వచ్చేలా
పొంగిన ఆవేశం
జైలుగదికి చెమటలు పట్టేలా
అరిచిందట ఆకాశం.
పోరాడి గెల్చుకున్న
మధుర ఫలం కదా స్వేచ్ఛన్నది
పోయిన ప్రాణాలకు పరిహారం..
స్వాతంత్య్రం పెన్నిధి
ఈ దేశం మానవ చరిత్రకే
ఒక సందేశం
అహింసతో అణుబాంబుని
ఓడించే ప్రదేశం
హిమాలయంలా నిటారుగా నిలబడి
కోహినూరులా వెలుగుతూ కనబడి
గుండెని జెండాలా
గట్టిగా ముడేసి లాగు
జ్ఞాపకాల పూలు
జల్లుమని రాలిపడేలా
మువ్వనె్నల పరవశం
మనసంతా ముసిరేలా!!

-గరిమెళ్ళ నాగేశ్వరరావు, విశాఖపట్నం