Others

ప్రాణదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక చిన్న ముల్లు గుచ్చుకొంటేనే బాధపడే మనం అన్యాయంగా ప్రాణి వధకు పూనుకోవటం ధర్మం కాదు. మన బిడ్డలకు హాని కలిగిస్తే చూస్తూ ఊరుకుంటామా?
తన క్షీరంతోప్రజలకు సౌభాగ్యాన్ని కలిగిస్తూ ప్రాణాధారమైన గోవు బాధను చూసి గోపాలకుడైన శ్రీకృష్ణుడు సహించగలడా? గోవు ఎంతో పవిత్రమైంది. ధర్మదేవతా రూపధారిణి అయిన గోవును బాధించే కలిరాజును భరత వంశీయుడైన పరీక్షిత్తు దండించి మరలించడం మహాభారత ప్రసిద్ధి. అక్కడ కలిరాజును పరీక్షిత్తు శిక్షించాడు.
ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోమాత. అందరూ కోరుకునే అష్టైశ్వర్యములు గోవు అడుగులయందు ఉన్నాయని అంటారు. పాదాలయందు చతుర్వేదములుండు, గిట్టల చివర పన్నగులుందురు
పొదుగున పుండరీకాక్షుడు, మెడను ఇంద్రుడు నివసించుచుండు పెదవులు వైకుంట ద్వారములగును నాలుకయందు నారాయణుడుండును
కొమ్ములు గోవర్ధన పర్వతములగును, కొమ్ముల కొసలుసర్వ తీర్థములగును గోవు పాలయందు సరస్వతీ నదియు, పంచితమున గంగానదియు, గోమయమున శ్రీమహాలక్ష్మియును ఆజ్యమున అగ్నిదేవుడును నివసిస్తున్నవని పురాణాల తెలుపుతున్నాయ.
ప్రతి ఒక ఇంట్లో ఒక గోవువుంటే దైవం మన వెంటేఉన్నట్టే. మన శరీరంలోవున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులో వున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుందని, తరువాత మేతకు వెళ్ళినపుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుందని చెప్పబడినది.
ఆవు పేడ పిడకలు కాల్చటంవలన వచ్చే పొగ, ఆవుపేడతో అలికిన గోడలు అణుశక్తివల్ల వచ్చే రేడియేషన్‌నుండి కాపాడగలవని, ఆవు నెయ్యితో చేసి హోమంవలన వచ్చే పొగ వాతారణంలోని అనారోగ్య క్రిములను ఎలర్జీని పోగొడుతుందని గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ వేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు.అందరము మన ఉట్టు ఉన్న ప్రకృతిని ప్రాణులను కాపాడుకొందాం. ధర్మో రక్షితి రక్షతః అన్నట్టు మనం వన్యమృగాలను, ప్రకృతి, పర్యావరణాన్ని రక్షించుదాం. ప్రకృతి మనలను రక్షిస్తుంది.

- ఉషశ్రీ తాల్క