Others

నీ దీవనే అమ్మా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుడిబుడి అడుగుల బుడ్డాయిని కదా? నా వ్యక్తిత్వం, మూర్తిత్వం,
నన్నునన్నుగా నిలబడే ప్రేరణ నన్నుఉక్కిరి బిక్కిరి చేస్తుంటే-
లేచి నిలబడాలని, అడుగులు వేసి నడవాలని
తప్పటడుగులు వేస్తూ ఆధారాలను అనే్వషిస్తూ
అలజడి పడుతున్న నన్ను...
భవిష్యత్తులోకి స్వయం శక్తితోనే నడవాలని
పదిమందికి నీ అడుగులే మార్గదర్శకం కావాలని
ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించి
పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ, పరితపించి పోతూ
నిలత్రొక్కుకోవాలని, నిటారుగా నడవాలని
తల్లడిల్లుతున్న నా చిరుపాదాలు నొవ్వకూడదని,
అడుగులను అరిసెలపై నడిపించావు!
చిట్టిపాదాలు కందిపోతాయి!
వీడు తాను నిలబడి ఎందరినో నిలబెడతాడు,
అని ఎందరో సమంగళుల ఆశీస్సులు నాకు అందించి,
వారికి అరిసెల వాయనాలు ఇప్పించావు!
‘గోరింత దీపంవీడు- కొండంత వెలుగు పంచాలని’
మనసారా దీవించావు

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199