Others

పీడితజన బాంధవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతిపిత’ గాంధీ కన్నా ముందే ‘మహాత్ముని’గా, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గురువుగా ప్రసిద్ధి చెందిన జ్యోతిరావు పూలే మన దేశంలో ప్రప్రథమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు అండగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడిన ఘనత ఆయనది. ‘సత్యధర్మ శోధక మండలి’ని స్థాపించి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన యోధుడు పూలే. సామాజిక తత్వవేత్తగా, ఉద్యమకారునిగా, సంస్కరణ వాదిగా, సేవాతత్పరునిగా, బాలికా విద్య ప్రోత్సాహకునిగా, మహిళల హక్కుల పరిరక్షకునిగా, కార్మిక పక్షపాతిగా జన హృదయాల్లో ఆయన స్థానం చెక్కుచెదరనిది.
1827 ఏప్రిల్ 11న మహారాష్టల్రో పూలే జన్మించారు. తండ్రి గోవిందరావు పీష్వాల కాలంలో పూల వ్యాపారం చేయడంతో వారికి ‘పూలే’ అని పేరు వచ్చింది. చిన్నతనంలో చదువు మానేసినా తిరిగి పూణెలో 1941లో క్రైస్తవ, ముస్లిం మిత్రుల సహకారంతో స్కాటిష్ మిషన్‌లో ఆయన చేరారు. విద్యాభ్యాసం సాగిస్తున్న దశలో పుస్తక పఠనంపై మక్కువ చూపారు. 1948లో బ్రాహ్మణ స్నేహితుని వివాహానికి హాజరైన సందర్భంగా- వెనుకబడిన కులానికి చెందిన పూలే కుల వివక్షకు లోనై తీవ్ర మానసిక వ్యధ చెందారు. సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణ మిత్రుని సాన్నిహిత్యం, థామస్ రచన ‘మానవ హక్కులు’ పుస్తక ప్రభావంతో ఆయన సమాజం గురించి ఆలోచించేవారు.
కుల, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ వివక్షలకు అవిద్యే కారణమని పూలే గట్టిగా భావించారు. తన భార్య సావిత్రి బాగా చదువుకోవాలని బడికి పంపారు. 1848 ఆగస్టులో బాలికల పాఠశాలను, 1951-52లో మరో రెండు పాఠశాలలను పూలే దంపతులు స్థాపించారు. 1853లో దేశంలోనే తొలిసారిగా వితంతువుల అనాథ శిశువుల కోసం సేవాసదన్‌ను స్థాపించారు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, అక్కడ జన్మించిన ఓ బ్రాహ్మణ వితంతువు కుమారుడిని 1872లో దత్తత చేసుకున్నారు. తాను అనుభవించిన కుల వివక్షను ఇతరులు అనుభవించరాదని ఆకాంక్షించారు.
సహధర్మచారిణి సావిత్రితో కలిసి 40 ఏళ్ల పాటు నిర్వహించిన సామాజిక ఉద్యమాలు ఆయనకు దీన జనోద్ధారకునిగా సమాజంలో గుర్తింపు తెచ్చాయి. ఎక్కడ అన్యాయం, వివిక్ష చోటు చేసుకుంటే అక్కడ ఉద్యమం నడిపారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటూనే, బాధితులైన అగ్రకుల వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు. వితంతువులకు శిరో ముండనాలు చేసేది లేదని క్షురకుల చేత తీర్మానాలు చేయించారు. 1871లో సత్యశోధన పక్షాన ‘దీనబంధు’ పత్రిక నడిపారు. 1873లో గులాంగిరీ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1883లో కల్టివేటర్ విప్‌కార్డ్ (సేద్యగాడిపై చర్నాకోల), 33 వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించారు. బ్రాహ్మణేతరులు జరిపించిన కులాంతర వివాహాలు చెల్లవని బ్రాహ్మణులు తీర్మానాలు చేస్తే, సత్యశోధన మండలి ద్వారా కోర్టుకు వెళ్ళారు. 1990లో తన వాదనను కోర్టు సమర్థించి, తీర్పు వెలువరించగా తన ఉద్యమం ఫలించిందని ఆయన సంతృప్తి చెందారు. అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైనప్పటికీ, సామాజిక ఉద్యమాలను ఎలా నడిపించాలో తన అనుచరులకు ఆయన స్పష్టం చేశారు. 1890 నవంబర్ 28న తన 63వ ఏట అందరూ ప్రార్థనా గీతాలను ఆలపిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. భారతావనిలో గొప్ప సాంఘిక సంస్కర్తగా వాసికెక్కిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
*
( నేడు జ్యోతిరావు పూలే 191వ జయంతి )
*

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 95494