Others

తెలుసుకోవలసినవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాంతరాళము యొక్క దిక్కులు మానవులకు అగోచరములు. స్వర్గలోక, భూలోక, పాతాళ లోకములకు దక్షిణ దిక్కుగా నరకలోకము నిలిచియున్నదని పరీక్షిత్తునకు శుకయోగీంద్రులు శ్రీమద్భాగవతములో వివరించెను. పాపపుణ్య ఫలములు ప్రారబ్దమును బట్టి ఈ జన్మలోనే భూలోకముందు అనుభవింపక తప్పదు. ఉత్తమమైన మానవ జన్మ లభించినపుడు సద్వినియోగం చేసికొనక దుర్వినియోగముతో పాపములను మూటగట్టుకొనిన నరకములో శిక్షలు అనుభవింపక తప్పదని శుకయోగీంద్రులు తెలియజేసినారు. ఏ పాపమునకు ఎటువంటి శిక్షలు విధించెదరో కూడా చాలా చక్కగా విశే్లషించారు.
ఇతరుల ధనమును, భార్యలను, నిధి నిక్షేపములను అపహరించి అనుభవించినవారిని దృఢమైన గొలుసులతో బంధించి నవనాడులను ఉక్కిరి బిక్కిరి చేసెదరు. స్నేహితుని భార్యను వంచించి అనుభవించినవారిని మరుగుతున్న కాలద్రవములో పడవేయుచూ, తిరిగి పైకి లాగుచూ ఘోరముగా శిక్షించెదరు. అమాయకులను, నిర్దోషులను, బ్రాహ్మణులను బాధించినా, హత్య చేసినా సూకరముఖమనే పదునైన కోరలుగల కూపములో పడవైచి శిక్షించెదరు. వేదమును నిర్లక్ష్యము చేయు బ్రాహ్మణులను, అధర్మవర్తనులను అత్యంత జుగుప్సాకరమైన వైతరణీ నదిలో పడవైచి శిక్షించెదరు. స్వార్థపూరితమైన వేటను చేయుచూ వన్యమృగములను ఏ విధంగా తరిమి చంపుదురో అటులనే యమకింకరులు జీవిని తరిమి తరిమి ఆయుధములతో అణచివేయుదురు.
స్వప్రయోజనము కొరకు దోషభూయిష్టమైన యజ్ఞ యాగాదులు చేయువారిని నరకమున పదునైన రంపములతో కోయుచుందురు. పశుపక్ష్యాదులను, చిన్నపిల్లలను చెరబట్టి హింసించువారిని విషజ్వాలలందు పడవేసి శిక్షించెదరు. అతిథికి మర్యాద చేయక అసహ్యపు చూపులు చూసినవారిని నేత్రములు పెకలించి శిక్షించెదరు. పరమ లోభియైన ధనవంతుని సూచీముఖమనే శిక్షతో పదునైన శూలములతో గ్రుచ్చి గ్రుచ్చి హింసించెదరు. ఇంకనూ అనేక రకములైన నామములతో నరకమున శిక్షలు గలవు. అమిత సంఖ్యలో యమదూతలు అధర్మవర్తులకు నిరంతరము శిక్షలు అమలు చేయదురని శుకయోగీంద్రులు పరీక్షిత్తు మహారాజుకు వివరించెను.
నరజన్మ పొందిన జీవుడు పుణ్యఫలమున స్వర్గలోకవాసము చేసి ఆనందమును అనుభవించును. పాపఫలమువలన నరకమున శిక్షలు అనుభవించి తిరిగి అనేక యోనులలో జన్మించుచూ ఈ భూలోకమున జీవన చక్రమునందు పడి జీవుడు తిరుగాడుచుండును. అందువలన వేదయుక్తమైన, శాస్త్ర సమ్మతమైన స్వధర్మము పాటించుచు ఆ దేవదేవుని నిత్యస్మరణ చేయువారు నిస్సంశయంగా సచ్చిదానందమును పొందురనుటలో సందేహం లేదని శుకయోగీంద్రులు పరీక్షిత్తునకు సాంత్వన బోధ గావించెను. ఇది మనకు ఒక హెచ్చరిక అని గ్రహించి జాగరూకత పొందెదముగాక.

-వారణాసి వెంకట సూర్యకామేశ్వరరావు