Others

మరణశయ్యపై మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశం నిశ్శబ్దంగా వుంది
అవని నిర్లిప్తంగా వుంది
కాలం నిశే్చష్టంగా వుంది
చరిత్ర ముభావంగా వుంది
భూకబ్జాల్లో గమన నీతి
సెజ్‌ల పేరిట ధూర్త రాజనీతి
ప్రపంచీకరణ పడగ నీడలో ప్రభుత్వం
ముసిరిన అవినీతి పొగమంచులో దృశ్యాదృశ్యంగా వుంది వూరు
ఎండిపోయిన కోనేరు ఇంకిపోయిన కన్నీరు
మూసిన అరాచకపు మంచుపొగలో సత్యాసత్యంగా వుంది వూరు
చావుకి బతుక్కీ.. మనిషికీ మనుగడకీ మధ్య పోరు
మానవతా విలువలు.. మొలుస్తున్న శిలువలు
అభయారణ్యాల్లో పెంపుడు మృగాలు
రెక్కలు తెగిన స్వేచ్ఛ.. నెత్తుటి మడుగులో శాంతి
ఇక్కడ ఇళ్లు.. మూతపడని కళ్లు
కటకటాల జైళ్లు.. పూరించలేని గళ్లు
తగలబడిపోతున్నా పొగరాని నెగళ్లు
వీధివీధిలో ‘మందు’ పాతర
నిత్యం పోలేరమ్మ జాతర
బొరియల్నిండా ఎముకలు నింపుకొని
స్వేచ్ఛగా ఊళలు వేస్తున్న థార్మిక జంబుక సంతతి
కార్పొరేట్ విద్యాలయాల్లో బ్రాయిలర్ కోళ్ల వర్ధమాన సంతతి
ప్రభుత్వ ఆసుపత్రుల పంచల్లో శ్వాసిస్తున్న అస్థిపంజరాలు
అద్దెకు అమ్మతనాలు... మమతానురాగాలు కోల్పోయిన పసితనాలు
ప్రేమసీమలో హింసోన్మాదాలు
ఆత్మహత్యలుగా హత్యలు
జులాయిగా మధించిన సంకరజాతి పశువులు ప్రదర్శన మేళాకు
దుక్కి దున్ని వగ్గులైన దుక్కిటెడ్లు కబేళాలకు
రుణ క్షేత్రాల్లో అన్నదాతల బలవన్మరణాలు
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది
నిర్జీవుల్ని సముద్రం నెట్టేసినట్లు
నిర్ధనుల్ని భూమి కూడా గెంటేస్తుందని
కవి మాయావి... కవిత్వం ఎండమావి
బాల్యం లేని బాల్యం, యవ్వనం కాని యవ్వనం
వృద్ధాప్యం కాని వృద్ధాప్యం
రంగురంగుల కలల్లో యువత
మత్తులో జోగుతున్న నాగరికత
వాదాలెందుకు వివాదాలెందుకు
మానవతకు రక్త్భాషేకం చేసేందుకు
గత చరిత్రను తగులబెట్టు
అబద్ధాల పుట్టల్ని పగులగొట్టు
పగటి వేషగాళ్ల పనిపట్టు
దోపిడీ దౌర్జన్యాలని తుడిచిపెట్టు
ఇక్కడ మనిషి లేడు... మానవత లేదు
ఇది నీచ నికృష్ట భ్రష్ట దుష్ట సంస్కృతి
ఇది కుటిల కుతంత్ర కృత్రిమ కుహనా వ్యవస్థ
నిష్కృతిలేని పరిష్కృతిలేని దుర్భర దుస్థితి
ఇది దారిలేని గమ్యంలేని అంధకార పరిభ్రమణం
మంచు కురుస్తూనే వుంది
మరణశయ్యపై మానవత భారంగా ఊపిరి పీలుస్తూనే వుంది
ఆకాశం నిశ్శబ్దంగా వుంది
అవని నిర్లిప్తంగా వుంది
కాలం నిశే్చష్టంగా వుంది
చరిత్ర వౌనంగా వుంది
*

-ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు 99511 28566