Others

కూల్...కూల్.... కుర్తీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడంతా పోటీప్రపంచం. ఈ ప్రపంచంలో ఫ్యాషన్ ఎప్పుడూ ఓ అడుగు ముందుగానే ఉంటుంది. మార్కెట్లోకి వచ్చే నయా ఫ్యాషన్స్, ట్రెండ్స్‌ను ఫాలో అవడంలో నేటి టీనేజీ అమ్మాయిలు ముందుంటారు. అది కూడా సీజన్‌కు తగ్గట్టుగానేనండోయ్.. ఎందుకంటే మండు వేసవిలో భారీ పనితనమున్న లెహెంగాల జోలికి వెళ్లమన్నా వెళ్లరు అమ్మాయిలు. హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఉండే కుర్తీలకే
ఎక్కువ ఓటు వేస్తారు నేటితరం అమ్మాయిలు. అయితే సౌకర్యవంతంగా ఉండటంతో పాటు పర్‌ఫెక్ట్ లుక్, కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు ఈ కుర్తీలను మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి
కుర్తీకి కొత్త లుక్‌ను తెచ్చేస్తారు. లెగ్గిన్స్, జగ్గిన్స్, పటియాలా, పలాజోలకు నప్పేలా రకరకాల కుర్తీలను అంటే.. పొడవాటి కుర్తీలు, పొట్టి కుర్తీలు, ఫుల్ స్లీవ్స్, స్లీవ్స్, కోల్డ్ స్లీవ్స్,
స్ట్రెయిట్ కట్‌లను ఎంచుకుంటారు. అంతేకాదండోయ్.. శరీరాన్ని వేడి నుంచి
రక్షించేందుకు ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ
లేలేత రంగుల్లో సమ్మర్ ఫ్రెండ్లీ కుర్తీలను ఎంచుకుని అటు
ఫ్యాషన్‌తో పాటు ఇటు సౌకర్యవంతంగా
ఉండేలా చూసుకుంటారు.