వినమరుగైన

అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందం ఒక సార్వత్రిక అనే్వషణ
కొంతమందికి, గతంలో ఎక్కడో విడిచిపెట్టేసినది.
మరి కొంతమందికి భవిష్యత్తులో కనుక్కోబోయేది
జీవితంలో ఇతర మంచి విషయాల్లానే
ఆనందం కూడా స్వతహాగా అంతుచిక్కనిది
అయితే దాన్ని పట్టుకోవడం దుర్లభం కాదు
నిజానికి చిన్నప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను
చదువై పోయి ఉద్యోగంలో చేరితే వస్తుందనుకున్నాను
మంచి జీతం వస్తే దొరుకుతుందనుకున్నాను
పెళ్లయితే, పిల్లలు పుడితే, వాళ్లు పైకొస్తే,
వాళ్లకి పెళ్లయితే, వాళ్లకి పిల్లలు పుట్టి స్థిరపడితే...
నేను రిటైర్ అయిపోతే.. ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చాను
నేను హాయిగా ఆనందంగా ఉండొచ్చని ఎదురుచూశాను
అన్నీ జరిగాయి కాని అది మాత్రం ప్రతిసారి
దొరికినట్టే దొరికి చెయ్యి జారిపోయ్యేది
మనం చేసే పనుల తుది ఫలితం అనుకూలంగా ఉంటే కలిగే సంతోషానే్న ఆనందం అనొచ్చు
తరచి చూస్తే వీటన్నిటిలో కొద్దో గొప్పో ఆనందం దాగి ఉంది.
కొత్త విషయాలు కనుక్కున్నప్పుడు, తెలుసుకొన్నపుడు
జీవితం యొక్క పరిధి అవగాహనకొచ్చినప్పుడు
దాని రంగు, శబ్దం ఆస్వాదించినప్పుడు
జీవించడమనే గొప్ప కళ తెలిసినప్పుడు, సాధన చేసినప్పుడు
ఎవరి నుంచీ ఏమీ ఆశించనప్పుడు
నిరాశ మీద ఆధిపత్యం సంపాదించినప్పుడు
భావోద్వేగాల మీద, పరిస్థితుల మీద నియంత్రణ సాధించినప్పుడు
ఇప్పటికే విజయం సాధించిన ఇతరులను కలిసినప్పుడు
భయం నుంచి పుట్టే ఆందోళన, అసూయ, దురాశ, కోపం, ద్వేషం నుంచి విముక్తి పొందినప్పుడు
ఆనందానికి తార్కాణం ఎక్కడ
మన ఆలోచనలో, పని తీరులో, జీవనశైలిలో
సమతుల్యమైన విలువల్లో
ఉన్నదానితో సంతృప్తి
ఆచరణలో కనిపించే ప్రేమ
ఆలోచనలు, వ్యక్తిగత నమ్మకాల ప్రేరణతో ఉత్తేజితుదవై
ధైర్యంతో క్రమశిక్షణతో
జీవితాన్ని రూపకల్పన చేసి
నిర్దిష్ట గమ్యంవైపు సాగే కార్యకలాపాలతో
అనేక విభిన్న అనుభవాల మిశ్రమంతో కూడిన
బాగా బ్రతికిన జీవితమే తార్కాణం
ఆనందానికి దారులు ఎన్నో
అయినా అది చేరవలసిన ఒక గమ్యస్థానం కాదు, అది ఒక ప్రయాణం
స్వర్గానికి దారే స్వర్గం అన్నట్టు
*

-డి.యస్.యస్.రామం 9848726817