Others

ఆ పాటలను బ్యాన్ చేయాలట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఈ బోల్డ్ బ్యూటీ.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత గొడవపడి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుర్రకారు షాక్ తినే కామెంట్ చేసింది కంగనా. బాలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్స్‌ని బ్యాన్ చేయాలంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్ ఉండడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. చిన్న చితకా సినిమాలకీ కాసింత క్రేజ్ వస్తుందంటే కారణం కూడా కొన్ని ఐటమ్‌సాంగ్సే. అలాంటి ఐటెమ్‌సాంగ్స్ వెంటనే నిషేధించాలని అంటోంది కంగనా. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు స్టార్ హీరోల మసాలా సినిమాలు నచ్చవు. తెల్లగా అవ్వడానికి ఈ క్రీములు పూసుకోండి.. ఆ క్రీములు రాసుకోండి అని చెప్పే ఫెయిర్‌నెస్ బ్రాండులూ నచ్చవు. అలాగే నేనెప్పుడూ ఐటెమ్‌సాంగ్స్‌లో నటించను గాక నటించను..’’ అని చెప్పింది కంగనా. అంతటితో ఆగకుండా ఐటమ్ సాంగ్స్‌వల్ల అశ్లీలత పెరుగుతుందని.. వారి పట్ల శారీరక వాంఛ పెరుగుతుందని వెంటనే ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయాలని అంది. నేను ఐటమ్‌సాంగ్స్ చేయను అంటే బానే ఉంది కానీ మొత్తానికి సినిమాల్లోంచి ఐటమ్‌సాంగ్స్ తీసేయాలనడం కరెక్ట్ కాదని వాపోతున్నారు కుర్రకారు. కరీనా, మాధురీదీక్షిత్, ఐశ్వర్యారాయ్, ప్రియాంకాచోప్రా లాంటి స్టార్ హీరోయిన్లంతా ఐటమ్‌సాంగ్స్‌లో నటించిన వాళ్లే. ఐటెమ్‌సాంగ్స్‌లో అశ్లీలత ఉంటుందన్న కంగనా.. ఎన్ని సినిమాల్లో యువతను రెచ్చగొట్టేలా కనిపించిదో గుర్తుచేసుకోవాలనుకుంటున్నారు మరికొందరు.