Others

పండంటి కాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుబంధాలు.. ఆప్యాయతలు.. అనురాగాలు.. ఆనాటి మానవుల్లో గాఢంగా నిక్షిప్తమై ఉండేవి. అందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి బతికేవారు. ఒక ఇంటిలో అన్నదమ్ములందరూ కలిసిమెలిసి జీవించేవారు. మనస్పర్థలకు తావుండేది కాదు. కానీ డెభ్భై దశకానికే మానవునిలో వికృతరూపాలు పొడచూపసాగాయి. ఆత్మీయతకు సమాధి కట్టేసి, తనది కాని డబ్బు వెంట వెంపర్లాడటం ప్రారంభించాడు. దానిని ఆధారం చేసుకొని కుటుంబాల్లో ఆత్మీయతలు, అనురాగాలు ఎంత ముఖ్యమో, అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు ఎంత అవసరమో మనకు తెలియజేసే సినిమా ‘పండింటి కాపురం’. ఈ సినిమా 21 జూలై 1972న విడుదలై అద్భుత విజయాన్ని స్వంతం చేసుకుంది. కృష్ణకు మొదట్టమొదటి జూబ్లీ చిత్రం ఇదే! 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
ఇందులో ఎస్.వి.రంగారావు, గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణ అన్నదమ్ములు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. గుమ్మడి తనను మోసం చేశాడని రాణి మాలినీదేవి భావించి వారి కుటుంబంపై కక్ష కడుతుంది. జీవితం డబ్బుతోనే ముడిపడి వుంటుందని, మీరందరూ చిల్లరవాళ్లని ఎగతాళి చేస్తూ, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభాకర్‌రెడ్డి భార్య. ఈ పాత్రలో బి.సరోజ నటించింది. ఈమె అహంకారం వల్ల కుటుంబం విడిపోతుంది. కృష్ణ మంచి పాత్రను ఇందులో పోషిస్తాడు. ఆయనకు జోడీగా విజయనిర్మల నటించింది. ఎస్.వి.రంగారావు మనవడు ఆకలికి గురై మరణిస్తాడు. ఆఖరుకు రాణి మాలినీదేవికి నిజం తెలుస్తుంది. తన తప్పు తెలుసుకుంటుంది. గుమ్మడి-తనకు పుట్టిన కుమార్తె జయసుధను గుర్తిస్తుంది. బి.సరోజ తన అహంకారాన్ని వీడుతుంది. అందరూ మళ్లీ కలుస్తారు. కుటుంబంలో అనురాగాలు, ఆప్యాయతలను ఎంతో హృద్యంగా చిత్రీకరిస్తుంది సినిమా.
ఇంటికి పెద్దగా ఎస్.వి.రంగారావు నటన అపూర్వం. ‘బాబూ.. వినరా...’ పాటలో ఆయన హావభావాలు, విషాదాన్ని పలికించిన తీరు అద్భుతంగా వుంటుంది. గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణ పోటీపడి నటించారు. రాణీ మాలినీదేవిగా జమున నటన అద్భుతం. ఎస్.పి.కోదండపాణి సంగీతంలో పాటలన్నీ సూపర్‌హిట్టే. ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ’ పాటను ఈయనే పాడారు. మనసా కవ్వించకే పాట పాపులర్!
కుటుంబ వ్యవస్థ ఎంత బలమైనో మనకు ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాలోలాగా ప్రతి ఒక్క అన్నదమ్ములు అన్యోన్యంగా వుంటే బాగుంటుంది కదా అన్పిస్తుంది. బలమైన కథతో తయారైన సినిమా ఇది! అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం!

-మల్లారెడ్డి రామకృష్ణ సారవకోట, శ్రీకాకుళం జిల్లా