Others

మాటలేని సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వటపత్రశాయిలా గాలి కదలికలతో
ఆడుకుంటూ,
శూన్యలోకాలతో సంభిషించుకుంటూ
సప్తవర్ణకాంతి పుంజ వృత్త కేంద్రంలో...
అనంత విశ్వపు అణువుల అనుసంధానమైన,
నా జన్మ జీవధాతు సంమృద్ధితో,
అకౌకిక ప్రపంచంనుండి
లౌకిక ధరణిపైకి రావటం కోసం-
భూ ఆకర్షణ క్షేత్రానికి నేనుగా
అంతర్లీనం కావటానికి,
మానసికంగా జపించి - మనోవీధిలో తపించి
పంచ భూతాత్మక ప్రకృతివడికి
అనుసంధానం కావాలని బోర్ల పడితే...
పారాడటానికి పోరాటం సాగిస్తున్నాని,
పరివర్తన జీవితానికి జీవం నేనేనని,
బొబ్బట్లు, పాయసాలు, పదిమందికి పంచి
ఉత్సవం చేశావు కదా? తల్లీ!!
భూదేవిలా నాకో మెతుకు నందించాలి,
నా జీవితం, జీవనం అన్నపానాలకు
లోటు ఉండకూడదని,
నా భవితవ్యపు దృఢ దీక్షను పరీక్షించాలని,
పుస్తకాలు, శస్త్రాలు, లేఖినులు, పసిడి గొలుసులు
ధనము - ఏది పట్టుకుంటే నా చిన్నారికూడ,
ఆ దశను అందుకుంటాడని,
జీవన ప్రవృత్తిని పెంచుకుంటాడని,
నా మనస్తత్వ భావాలను,
ఊహ తెలియని వయసులోనే-
గుర్తించాలనే మానసిక వైద్యురాలిగా-
ఆకళింపులు, ఆలోచనలులేని నాకో పరీక్షగా,
‘‘మేధాశక్తి, ఇచ్ఛాశక్తి,
క్రియాశక్తి అంటే ఇదేరా తండ్రీ
ఇకముందు అడుగడుగు పరీక్షలే!’’
ఎదుర్కోనే సంసిద్ధతకు నాంది ఇక్కడే-
నీ మూగమనసు అందిస్తున్న సందేశం
నాకవగత వౌతునే వుంది!
అమ్మా! నీ హృదయం నిండా వాత్సల్యశక్తి
నీ కన్నుల నిండా అనురాగ దృష్టే నింపుకున్నావు!!

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199