Others

మార్గదర్శి నీవేనని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనిచ్చిన నినే్న నేను దేవతగా భావించాను
ఆటపాటల్లో, అమ్మనాన్న కనెర్రలో కాపాడిన
నిన్ను నేను నాప్రేరణశక్తిగా భావించాను
కష్టంలో సుఖంలో చేదోడువాదోడై
కడదాకా నిలుస్తానన్న నిన్ను
నా ఇంటివేల్పుగా భావించాను

అత్యాచారాలు, భ్రూణహత్యలు
లింగవివక్ష, గృహహింసా, వరకట్న వేధింపులు
లైంగిక దాడులు ఎనె్నన్ని క్షోభల
ననుభవించే నిన్ను చూసి నన్ను నేను నిందించుకున్నాను

లక్ష్మీ వని ఆదిశక్తివని నిన్ను కీర్తించి
సబలవేనని, సమన్వయకర్తవని
అన్నింటికీ కారణం నీవేనని నీశక్తిని
నీకు గుర్తు చేస్తూ కూడా నిన్ను బులింపుచ్చాననుకొని
నేను నాలో కుమిలిపోయాను

పురోగామివని, మార్గదర్శి నీవేనని
లింగ వివక్ష లవేని లేని సమ సమాజం వస్తుందని
మానవత్వమే మిన్ననని దానికి ప్రతిరూపం నీవేనని
ఆత్మస్థైర్యంతో, ధైర్యం, పట్టుదలతో విశ్వవిజేతగా
నిలుస్తావని నీకు చెప్తూ నన్ను నేను మార్చుకుంటున్నాను
ఇంతా చేసినా ...

నాలో ఏమూలో కర్కశత్వ కణం
అణిగి మణిగి ఉందేమోనమ్మా
కాలం చూసి కాటేస్తోంది
దాన్ని నీవే నీ శక్తియుక్తులతో కాలరాయు తల్లీ
నీకిదే నా విన్నపం

- కావ్యాంజలి