Others

రుధిరార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైతే నేమి
ఎంత అమానుషం
వీళ్లు మనుషులేనా
కామాంధత ఇంత గుడ్డితనాన్ని ఇస్తుందా?
ఆప్పుడప్పుడే విచ్చుకోబోతున్న మనుసును కోసేసి..
ప్రాణాన్ని మింగేస్తారా?
ఎంత నీచం!
మనిషిననే ముసుగేసుకున్న మృగం
నల్లనిగుడ్లున్న కళ్లతో
విశ్వవిహారం చేసి వీక్షించి
పసివాడని మొగ్గలను
తుంచి చిదిమి
ఖగోళంలో విసిరేయడమే
వీరి లక్ష్యమా?
చిదిమేస్తున్న కంఠాలలో వెలువడే శబ్దాలతో
ప్రతిధ్వనించదా ప్రకృతి
కురిపించదా రుధిర ధారలు
వినిపించవా ఉరుములు
ఝళిపించదా మెరుపులు
ఇంకా ఎంత కాలం ఈ రుధిరార్చన
ఖడ్గాలు తీసి మృగాలను ముట్టడించి
పైశాచికత్వాన్ని కాలరాచి
మానవత్వాన్ని మేల్కొపుదాం రండి

- ప్రసన్నాంజలి