Others

‘రాజ మహరాజ..’(. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.ఎస్.శేషాచలం నిర్మాతగా, బి.ఏ.సుబ్బారావు దర్శకుడిగా యువా బ్యానర్‌పై నిర్మించిన ‘టింగురంగ’ చిత్రం 1952లో విడుదలయింది. ఈ చిత్రంలో మంత్రవాది శ్రీరామమూర్తి, ఎస్.వరలక్ష్మి, రేలంగి వగైరా నటించారు. సంగీతం టి.వి.రాజు, దినకరరావు అన్న వారలు సంయుక్తంగా చేసారు. ఈ చిత్రంలో తాపీ ధర్మారావు రచించగా, ఘంటసాల పాడిన ‘రాజ మహరాజ’ అనే పాటలంటే నాకు చాలా ఇష్టం. దీనిని చిత్ర నాయకుడైన శ్రీరామమూర్తిపై చిత్రీకరించారు. ఈ పాట పూర్తి శాస్ర్తియ సంగీతపు పోకడలతో వుంటుంది. నాకు తెలిసి ఈ పోకడలతో ఘంటసాల పాడిన మొదటి పాట ఇది. తర్వాత వచ్చిన ‘రసికరాజ’ (జయభేరి, 1959), ‘శివశంకరీ’ (జగదేకవీరుని కథ, 1961) పాటల సరసనో, వాటికన్నా కొంచెం పైనో వుండదగ్గ పాట ఇది. ఒక శాస్ర్తియ సంగీతకారుడు పాడితే (ఘంటసాల అలాంటివాడే) ఆ గమకాలు వగైరా ఎలా వుంటాయో అలానే వుంటుంది. సుమారు 7 నిముషాలు సాగే ఈ పాట గురించి తెలిసినవారు తక్కువమంది వుంటారు. మొదట్లో నిర్మాత, సంగీత దర్శకులు ఈ పాటను కర్ణాటక సంగీత విద్వాంసులతో పాడిద్దామని అనుకున్నారట. ఈ సంగతి తెలిసిన ఘంటసాల వారిదగ్గరకు వెళ్లి ‘అయ్యా, నేను విజయనగరంలో కొద్దిగా సంగీత విద్య నేర్చుకున్నాను, నాకు ఈ పాట పాడే అవకాశం ఇవ్వండి, నచ్చకపోతే అప్పుడు వేరే వారితో పాడించుకోండి’ అన్నారట. అలాగ పుట్టిన పాట ఇది. ఈ సంగతులన్నీ చిత్ర నాయకుడు శ్రీరామమూర్తిగారు ఒక సభలో చెప్పగా నేను విన్నాను. ‘టింగురంగ’ చిత్రం తమిళంలో ‘శ్యామల’ అన్న పేరుతో తయారయింది. తమిళ పాట విని, తెలుగు పాట వింటే ఘంటసాల ఎంత గొప్పగా, ఎంత మధురంగా పాడేరో తెలుస్తుంది. పాఠక శ్రోతలు ఈ రెండు పాటలూ వింటే నా మాటలలో అతిశయోక్తిలేదని తెలుస్తుంది.

-డి.ఎస్.శంకర్, వక్కలంక