Others

అనుష్క శర్మ స్థానంలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరి’. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. అనుష్కశర్మ, కర్ణేశ్‌శర్మ, ప్రేరణా అరోరా, అర్జున్ ఎన్.కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. అనుపమ్‌రాయ్ బాణీలు అందించారు. హిందీలో ఈ నెల 3న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో అనుష్క నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అనుష్క స్థానంలో నయనతారను దర్శక, నిర్మాతలు అనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నయన్ ఇప్పటికే ‘డోరా’, ‘మాయ’వంటి హారర్ సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆమె అయితేనే పాత్రకు సరిపోతారని అభిప్రాయపడుతున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నయనతార ఇటీవల బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు.