Others

ఒక దర్శక దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ
దర్శక మాలిక- విజయవీచిక
రచన: యడవల్లి, వెల: రూ.250/-
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్,
27-1-54, కారల్‌మార్క్స్ రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ-2.
*
గ్రేట్ డైరెక్టర్స్ పేరుతో లోగడ తెలుగులో సినీ విజ్ఞాన విశారద ఎస్.వి.రామారావు రచించిన ఒక గ్రంథం పాఠకులను అలరించింది. ఇప్పుడు మరొక గ్రంథం వచ్చింది.
నాటకానికి, సినిమాకు దర్శకుడు గురువు. కర్ణ్ధారి. దిక్సూచి. పనికిమాలిన కథను కూడా బాలచందర్ వంటి దర్శకులు మధురకావ్యంగా తీర్చిదిద్దారు. ఉత్తమ కథలు అగ్రశ్రేణి నటులు ఉన్నా దర్శక ప్రతిభ లేకపోవటంవల్ల ‘్ఫ్లప్’చిత్రాలుగా మారాయి. అంటే సినిమా అంటే దర్శకుడే అని తాత్పర్యం.
తెలుగులో మంచి చలనచిత్ర విమర్శకులు కొందరున్నారు. పల్లవి అనే అమ్మాయి మహానటి సావిత్రి వంటి జీవిత చరిత్రలు (బయోగ్రఫీ) రచించింది. ఒక రాజకుమారుని కథ వంటి ఆటోబయోగ్రఫీలు కూడా (టిఎల్ కాంతారావు) లోగడ వచ్చాయి. ఇప్పుడు యడవల్లి తెలుగులోని అగ్రశ్రేణి దర్శకుల గూర్చి ఒక పుస్తకం విడుదల చేశారు. ఇది సర్వాంగ సుందరంగా ఉంది. సందర్భోచితంగా ఆయా దర్శకులు దర్శకత్వం వహించిన చిత్రాలలోని ఒక ఫొటోకూడా ఆయా వ్యాసాలల్లో పొందుపరిచారు.
అగ్రశ్రేణి దర్శకులు అనగానే మనకు కదిరి వెంకటరెడ్డి, కాశీనాథుని విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావుగార్ల పేర్లు వెంటనే స్ఫురిస్తాయి. వీరి ప్రతిభ అసామాన్యమైనది. ఒక గుణసుందరి, ఒక శంకరాభరణం, ఒక ముత్యాలముగ్గు, ఒక తాతమనుమడు వంటి చిత్రాలు అజరామరాలు. కాళిదాసు కావ్యాల వంటివి. హిందీలో శాంతారాం, బెంగాలీలో సత్యజిత్‌రాయ్, తమిళంలో బాలచందర్, తెలుగులో కె.వి.రెడ్డి- వీరిని ‘దర్శకుడు’ అనే పదంకన్నా ఎక్కువ స్థాయిలో చూడాలి. నవ్‌రంగ్ చిత్రం కాళిదాస కావ్యం కన్నా ఏ విధంగా తక్కువ?
‘‘నేను విశ్వనాథ్ చేసిన పిండి బొమ్మను’’ అన్నది రాజ్యలక్ష్మి (శంకరాభరణం). దర్శకుడు తలచుకుంటే కోతిని నాతిని చేయగలడు. నాతిని కోతిని కూడా చేయగలడు. నిజానికి హీరోకన్నా దర్శకునికే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. దుక్కిపాటి మధుసూదనరావుగారు కె.వి.రెడ్డిగారి కాల్‌షీట్లకోసం రెండు సంవత్సరాలు తన చిత్ర నిర్మాణం వాయిదా వేసుకున్నారు. యడవల్లి ఈ గ్రంథంలో దాదాపు డెబ్బది మంది ప్రతిభావంతులైన తెలుగు దర్శకులను సంక్షిప్తంగా పరిచయం చేశారు. మరొక ముప్పది మందిని చేర్చినట్లయితే శతమానం భవతి అన్నట్లుండేది. తొలితరం పౌరాణిక యుగం నుండి మొన్నటివరకు వచ్చిన దర్శకుల డైరీ వంటిది ఈ పుస్తకం. తేనెటీగ విష పుష్పాలపై వాలినా మధురమైన తేనెనే స్వీకరిస్తుంది. అలా యడవల్లి చాలా సుతిమెత్తగా ఎక్కడా నెగిటివ్ దృక్పథం లేకుండా ఈ వ్యాస పరంపరను కొనసాగించారు. అది రచయిత మంచితనానికి నిదర్శనమే. అయినా దర్శకప్రతిభ లోపిస్తే సినిమాలు ఎలా భ్రష్టుపడతాయో ఉదాహరణప్రాయంగా కొన్ని ఘట్టాలు ఈ రచయిత ఉదాహరిస్తే బాగుండేది.
ఈ గ్రంథానికి వారు ‘‘దర్శక మాలిక- విజయ వీచిక’’అని పేరుపెట్టారు. దీనిని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధృవతార అయిన ఎల్.వి.ప్రసాద్‌గారికి అంకితం చేయటం సముతంగా ఉంది. హెచ్‌ఎంరెడ్డి, వైవిరావు, గూడవల్లి రామబ్రహ్మం, చిత్రపు నారాయణమూర్తి వంటి వారు తొలితరం దర్శకులు. కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, వేదాంతం రాఘవయ్య, కె.ఎస్.ప్రకాశరావు, ఎల్.వి.ప్రసాద్, మలితరం దర్శకులు. ఆదుర్తి సుబ్బారావు, సిఎస్‌రావు, పి.పుల్లయ్య, సి.పుల్లయ్య, వి.మధుసూదనరావు, తామి చాణక్య ఆ తర్వాతి యుగం వారు కె.రాఘవేంద్రరావు, బాపయ్య, తాతినేని రామారావు, సింగీతం శ్రీనివాసరావు వంటివారు ఆ తర్వాతి యుగానికి చెందినవారు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు మాటల్లో ఇదొక అద్భుత కృషి. వంటవాళ్లు ఎందరో ఉండగా మనం నలభీమపాకం అని ఎందుకు అనుకుంటున్నాము? అంటే వారి వంటవార్పూ అతిలోకమయినది కనుక. సినిమా ఒక భారీ పరిశ్రమయే అయినా ఇందులోనూ ఎంతో కళ ఉంది. కొంత కాకరకాయా ఉంది. ఈ పుస్తకం చాలా బాగుంది అంటూ కె.బాపయ్య, ఊర్వశి శారద, వెనె్నలకంటి, సి.ఉమామహేశ్వరరావులు కితాబునిచ్చారు. ‘‘కళలు ప్రజల అభ్యున్నతికి వారి మనోవికాసానికి తోడ్పడాలన్నది కె.ఎస్.ప్రకాశరావుగారి ఆశ-ఆశయం. ప్రతిభ ఎక్కడ ఉన్నా పసికట్టి దానిని చిత్రసీమకు పరిచయంచేసిన దర్శకుడాయన’’ (పుట 66). ఆత్రేయను, ‘పోరాబాబూ పో- పోయి చూడు ఈ లోకం పోకడ’ (దీక్ష) అనే పాటలో తెరంగేట్రం చేయించింది ఈయనే. మన దర్శకులలో నటులు రచయితలు ప్రొడ్యూసర్లుగా బహుపాత్రాభినయం చేసినవారు కూడా ఉన్నారు. అందుకు పాలువాయి భానుమతిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సి.ఉమామహేశ్వరరావుగారి వ్యాసం కొంచెం లోతుగా చేసిన అధ్యయనం. ఎక్కడ తర్కం ఉంటుందో అక్కడ నాటకీయత ఉండదు. అంటే ‘ఆర్టిస్టిక్ లైసెన్సు’ అని అర్ధం చేసుకోవాలి.
‘పెట్టుబడి’ పేరుతో సి.ఉమామహేశ్వరరావు రచించిన వ్యాసం చదివితే కొన్ని ఆలోచనలు రేకెత్తుతాయి.
1) సినిమా పరిశ్రమ. అంటే డబ్బుతో కూడిన వ్యవహారం. ఇక్కడ కళ- ఆదర్శం అనేవి గేణాలుగా భావించేవారున్నారు. అలాకాక తమిళంలో డిఎంకె నాయకులు తెలుగులో కొందరు కమ్యూనిస్టులు లోగడ భావ ప్రచారానికి సినిమా వంటి బలమైన ప్రచార సాధనాన్ని ఉపయోగించుకున్నారు. మొదటి రాత్రి బెట్‌రూంలో సామ్యవాద సిద్ధాంతపు పాటలు పాడించిన శ్రీశ్రీ, కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదాన-వంటి పాటలను సందర్భశుద్ధి లేకుండా ప్రజల నెత్తిన రుద్దిన సన్నివేశాలు సినిమాలల్లో ఉన్నాయి. ఇదంతా ఆదర్శంగా బలవంతంగా రుద్దే ప్రయత్నం మళ్లీపెళ్లి, మాలపిల్ల వంటి చిత్రాలను నిర్మించినవారూ రచించినవారూ నటించినవారూ ఎవరైనా మాలపిల్లను పెళ్లిచేసుకున్నారా? కట్నాలతో సహాయ తమ కులంలోని పిల్లలనే కోడళ్లుగా తెచ్చుకున్నారు. దీనిని హిపోక్రసీ అంటారు. ఇలాంటి విషయాలు సవాలక్ష ఉన్నాయి. ఐతే యడవల్లి ‘‘అలాంటి’’విశే్లషణ జోలికి పోలేదు. నాకు బాగా గుర్తున్న కొందరు ప్రముఖ దర్శకుల పేర్లుకూడా ఇందులో కనిపించలేదు. బహుశా రెండవ భాగం వ్రాయాలనుకున్నారో ఏమో తెలియదు.
ఐనప్పటికీ చేసిన ప్రయత్నం విజయవంతమైనదేనని చెప్పవచ్చు.
యర్ర గుడిపాటి వరదరావు అంటే ఎవరికీ తెలియదు. వై.వి.రావు అంటే తెలుస్తుంది. హనుమంతప్ప మునియప్ప రెడ్డి అంటే ఎవరికీ తెలియదు. హెచ్‌ఎంరెడ్డి అంటే తెలుస్తుంది. కదిరి వెంకటరెడ్డి ఎవరు? అని ప్రశ్నిస్తారు. కె.వి.రెడ్డి అంటే సుపరిచితులు. ఇలా ఈ గ్రంథంలో చలనచిత్రాభిమానంగల వారికి చాలా సమాచారం లభిస్తున్నది. 2012 ప్రాంతంలో ఈ వ్యాసాలు ఆకాశవాణిలో ప్రసారితమైనాయి. తర్వాత ప్రజాశక్తి ప్రచురణలవారు గ్రంథరూపంలో తెచ్చారు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్