Others

తెలుగులోనూ ప్రియా వారియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో హుషారుగా తన అందమైన కనుసైగలతో ఒక్కరోజులో దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మలయాళీ భామ ప్రియాప్రకాశ్ వారియర్. ఆమె నటించిన చిత్రం ‘ఒరు అదార్ లవ్’. ఇందులోని ‘మణిక్య మలరాయ’ అనే పాటలో కనుసైగలతో ఆమె పలికించిన హావభావాలు మాటలకు అందనివి. యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లో ఆమె తెగ ఫేమస్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ‘ఒరు అదార్ లవ్’ను మలయాళ భాషతోపాటు తెలుగు, హిందీ, తమిళ్‌లో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సినిమా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాట విడుదల తర్వాత ప్రియావారియర్ క్రేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె ఖాతాదారుల సంఖ్య విశేషంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రియావారియర్ హావభావాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని ఆమెపై, దర్శకుడు ఒమర్‌పై హైదరాబాద్‌కు చెందిన కొందరు ముస్లింలు కేసు పెట్టారు. దీనిపై ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని కోరారు. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పుఇచ్చింది.