AADIVAVRAM - Others

కచ్చకాయల ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఆడపిల్లలే ఎక్కువగా ఆడుకుంటారు. నీడ పట్టున కూర్చుని ఆడపిల్లలు ఆడుకొనేఆట. దీనిని ఒకవిధంగా ఇండోర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఓర్పు, నేర్పు కూడా ముఖ్యమై ఉంటాయి. 5. 7. 9 సంఖ్యలో రాళ్లు ఉంటాయి. వీటినే కచ్చకాయలు అంటారు. ఇవి మంచి చిన్న చిన్న గులకరాళ్లను ఏరుకొని వచ్చి వాటిని కాస్త నున్నగా చేసుకొని మరీ ఆటకు ఉపయోగిస్తుంటారు.
ఈ గులక రాళ్లకు బదులు పాలరాళ్లు కూడా ఉపయోగిస్తారు. ఈపాలరాళ్లను కూడా నునుపు చేసుకొని ఆటలో ఉపయోగిస్తారు.
ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ముందుగా మాట్లాడుకుని ఆటను ఆరంభిస్తారు. జట్టులో ఇద్దరు లేక ముగ్గురు కూడా ఉంటారు. ఒక్కోసారి ఇద్దరు మాత్రమే కూడా ఆడుతుంటారు.
ఆట ఆడేవిధానం: గులకరాళ్లను చేతిలో పట్టుకొని ఎగరవేసి అవి పడేలోపు చేతిని బోర్లాతిప్పి ఆ రాళ్లను అరచేతి వెనుకవైపు నిలబడేట్టుగా పట్టుకొంటారు ఆ తరువా కింద పడిన రాళ్లను ఒక్కోక్కటి తీస్తూ ఇంకో చేతిలో వేసుకొంటారు. చివరకు చేతివెనుక వైపు ఉన్న రాళ్లను పైకి ఎగురవేసి అరచేతిలో పట్టుకొంటారు. అయితే ఈ ఆట పలురకాలుగా ఆడుతుంటారు. కొందరు ఏడురాళ్లను చేతిలో తీసుకొని ఒక రాయిని పైకి ఎగురవేసి కింద ఐదు రాళ్లను కిందవేసి మరో రాయిని రెండు వేళ్లతో పట్టుకొని తిరిగి ఆ పైకి విసిరిన రాయిని కిందకు వచ్చేలోపు కింద రాళ్లను పట్టుకొంటూ చేతిలో పట్టుకొంటారు. ఈ రాళ్లన్నీ ఒకచేతిలోనే పట్టుకొంటారు. చిన్నపిల్లలు రెండు చేతులతో రాళ్లను పట్టుకొంటారు. కాని కాస్త పెద్దపిల్లలు ఒక్కచేతిలోనే ఆట మొత్తం ఆడడానికి మక్కువ చూపుతారు. మగ పిల్లలు ఈ ఆట జోలికి రారు కాని ఆడపిల్లలు మాత్రం ఎక్కువగా ఆడుతారు.
ఈ ఆట చేతిని బోర్లావేసి దానిపైన రాళ్లు నిలిపి అవి కింద పడకుండా కింద రాళ్లను ఏరడం అనేది ఒక్కోక్కరు ఒక్కోలా ఆడుతుంటారు.
పైకి విసిరేసి కింద రాళ్లను పట్టుకొనేటపుడు మొట్టమొదట ఆడేటపుడు ఒక్కొక్కరాయిని అందుకుంటారు. రెండవ సారి రెండు రాళ్లను, మూడవ సారి మూడు రాళ్లను అందుకొంటారు. ఇలా వీటిని పెంచుకుంటూ పోయినప్పుడు వీటిని ఏరి పైన రాయిని పట్టుకోవడంలో జాప్యం జరిగి పైన విసిరిన రాయి పట్టుకోలేకపోతే, లేక కింద రాళ్లను అనుకొన్నవి అనుకొన్నట్టు ఏరలేకపోతే వెంటనే ఆట కట్టు అవుతుంది. రెండవ వారు ఆట మొదలు పెడతారు. వాళ్లు ఇలాగే ఆడుతూ ఆట తప్పినప్పుడు తిరిగి మొదటి వారికి అవకాశం ఇస్తారు.
ఇందులో శనక్కాయలు ఏరడం, చెరగడం, ఏరడం, కొలవడం అంటూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఈ వైవిధ్యంలోనే ఆడపిల్లల నేర్పు బయటపడుతుంది. నేర్పుకు, యుక్తికి పదును పెట్టే ఆట పెద్దవారిని కూడా ఆకర్షిస్తుంది.

-జంగం శ్రీనివాసులు