Others

ఆడబిడ్డలే అమ్మలుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడు నిజంగా బతికుంటే
అక్కడ లేత ఆర్తనాదం సాక్షిగా
గర్భగుడి దూలానికి విగతగా వేలాడేవాడే
మమతల కభేళాలో
మానవతను వెతుక్కుంటూ
కొత్త పిచ్చోడై సంచరించేవాడే

ఒకప్పుడూ .. ఈ దేశం
మృతుల దిబ్బపై మొలచిన అనాగరిక పుష్పం
ఏళ్ళకు ఏళ్లుగా
అదే సన్నివేశం మోసుకుంటూ
పాకుతుందో.. దేకుతుందో...

అడుగులుగా అక్కడే తచ్చాట్లాడుతోంది
బ్రహ్మ జెముళ్ల పహారాలో నాగరికమై

ఎదిగిందో .. ఒదిగిందో.. ఏదీ తెలీదు
కచ్చితంగా మాత్రం కుదేలైంది

మనిషి శోకం ముందు
శ్లోకం మరుగుజ్జనీ..

మమత నూరిపోయలేని మతాలన్నీ
పవిత్రగ్రంథాల్నీ దుమ్ము తుడిచి
పారేసిన కాయితమ్ముక్కలనీ
లోకం ఎప్పుడు గుర్తిస్తుందో

ప్రపంచతల్లులారా..
పాతమురిపాలకు కాలం చెల్లి పోయినట్లే
జోలపాటల గొంతు నులిమి

ఇప్పుడిక శోక గీతికలు ఆలపించండి
ఉగ్గుపాలకు ఇంగితం కలగలపి
ఇకముందు కొత్త శిశువులకు జన్మనివ్వండి

అప్పుడన్నా మరో తరం
ఆసీఫానే కాదు ఆడబిడ్డల్ని
అమ్మలుగా భావిస్తుందేమో చూద్దాం....

బంగార్రాజు కంఠ 8500350464