Others
మజిలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 May 2018
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం, 9440836931
నడిచి నడిచి వేసారి
తలెత్తి చూశానోసారి
నుదుటిన పూసిన
జంట ఇంద్రధనుస్సులు
వాటి కింద సాంద్రీకృత
సమ్మోహన సరస్సులు
ఆపేక్షతో విరబూసిన చక్షువులని
అమృతపు చలివేంద్రాల్లా...
మహేంద్రజాల కేంద్రాల్లా
అయస్కాంత కెరటాల సంద్రాల్లా
దప్పిక తీరింది... నడక తప్పింది
మజలీ ఇదేగా మరు జన్మ దాకా!