Others

ఆహార భద్రతకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ‘అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్’ (ఎఒఎ) - పచ్చని రంగు బాక్స్- విధానం ప్రకారం 1986-88ల్లో పంటకు మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర ఎక్కువ వున్నట్లయితే అది సాంవత్సరిక సబ్సిడీగా గుర్తించబడి, పంట ఉత్పత్తి విలువపై 10 శాతానికి మించకుండా నిర్ణయించాలి. మార్కెట్ ధరకు సంబంధం లేకుండా, 30 ఏళ్ళ నాటి ధరతో పోల్చడం, సబ్సిడీ మొత్తాన్ని నూరు శాతం ఉత్పత్తి ప్రాతిపదికన లెక్కించడం, ప్రభుత్వం, ఎమ్‌ఎస్‌పి సమకూర్చుకొనే క్వాంటిటీని పరిగణించకపోవడం వంటి ఎఒఎ నిబంధనలు- అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేద రైతులకు అశనిపాతంగా మారాయి. ఎఒఎ నిబంధనల కారణంగా కోట్లాది భారతీయ పేద రైతాంగానికి , ఆహార భద్రత చట్టం అమలుకు చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతాంగ సంక్షోభాన్ని పట్టించుకొనే పరిస్థితి లేదు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ దుస్థితి, ప్రకృతి విపత్తులు, కరువుకాటకాలు, వరదలు, తుపాన్లు, పంట తెగుళ్లు, విష రసాయనాలు, నకిలీ విత్తనాల పుణ్యమాని మన దేశంలో రైతుల బతుకులు గాలిలో దీపాలుగా వున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ ప్రభుత్వం- ఉత్పాదక ఖర్చులను నిర్దుష్టంగా లెక్కించి పంటలకు కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్ల మేర నిర్థారిస్తామని అంటోంది. కానీ స్వామినాధన్ సిఫార్సులను గీటురాయిగా అమలుచేసే స్పష్టత లేదు. వాస్తవానికి క్వింటాల్ వరి సాగుకు 50 శాతం అదనంగా కలిపి రూ.3,237 మద్దతు ధర నిర్ణయించాలని- రైతుల ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీన్ని కేంద్రం పెడచెవిని పెట్టి రూ.1550లకు మద్దతు ధర నిర్ణయించింది. ఆత్మాభిమానంతో జీవించే రైతులు బలవన్మరణాలకు పాల్పడకుండా రక్షించగలిగినపుడే అసంఖ్యాక నిరుపేదల ఆహార భద్రతకు కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగేది. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోను రైతాంగ సంఘటిత పోరాటాలు మరింత తీవ్రతరమై ప్రభుత్వాలను కూలదోసే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

-జయసూర్య 94406 64610