Others

వాక్యం మనోగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను రాసే ప్రతి మనిషి
తన స్వగతాన్ని తప్ప నా మనోగతాన్ని
పట్టించుకోరెందుకు
అక్షరాలని దండగా కూర్చి
అందమైన అలంకారమై నిలిచినప్పుడు
వాసనలేని పువ్వులా
చెరిపి వేయబడతాను..
కవితనో, పాటగానో రూపుదిద్దుకునే
క్రమంలో ఎన్ని గాయాలో
ఎగ్గొట్టి దిగ్గొట్టి ముక్కలుగా చేసినా
అర్థంపర్థంలేని వ్యాకరణాల
సమూహంలో
నేను బిక్కుబిక్కుమంటూ
బతుకీడుస్తున్నాను..
సాహిత్య ప్రపంచంలో
పుస్తకాలు జెండాలు ఎగురుతాయి
అయినా అదెంతసేపు
నన్ను అందంగా పేర్చిన చేతులే
మరుసటి వత్సరంకల్లా...
సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కి
తరలిస్తారు..
వాక్యం రసాత్మకంగా అని గొప్ప పొగడ్త
అయినా ఇప్పుడు అంత హింసాత్మక
పైశాచికమే గాని
ఓలలాడించే మధురిమా ఎక్కడ..?
ఇప్పటికి నేనో శిథిల శిశిరాన్నై
ఎదురుచూసే వేకువ వసంతాన్ని
ముక్కలుగా విరగొట్టబడుతూ
భావానికీ, అనుభూతికీ మధ్య
లోలకంలా నేను
చస్తూ బతికే ‘వాక్యాన్ని..’!!
*

-పుష్యమీసాగర్.. 9032215609