Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శ్లోకాన్ని ఉదహరించిన విద్యారణ్యస్వామి, వేదానికి ఇన్ని అర్థాలు వున్నా తాను మాత్రం వైతానిక కల్పాన్ని మాత్రమే స్వీకరించి తన భాష్య రచన చేస్తున్నానని చెప్పుకున్నారు. (కొన్నిచోట్ల ఈ కల్పాలు ఏడు (సప్తకల్పాలు) అని వుంది. వాటి వివరాలు తెలియటంలేదు. ఏది ఏమైనప్పటికీ వేదానికి బహుమూలాలైన అర్థాలు వున్నాయి అనటంలో మన ప్రాచీన మహర్షులకు, వేదవేత్తలకు సందేహంలేదని మాత్రం విస్పష్టవౌతోంది)
కాగా వేద కల్పాల సన్నివేశాలను ఈ క్రింది విధంగా చిత్రించవచ్చు.
ఆధ్యాత్మిక విజ్ఞానము
ఈ చిత్రాన్ని బట్టి అన్ని విద్యలూ ఒకే కేంద్రం నుంచి విభిన్న కోణాలలో ఆవిర్భవిస్తున్నాయని అర్థవౌతోంది కదా! దీనినే ఉపనిషత్తులలో ‘ఏకవిజ్ఞానేన సర్వ విజ్ఞానం’ (ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి) అన్నారు.
విచిత్రమేమిటంటే గ్రీకు దేశంలోని ‘డెల్ఫీ’ నగరంలో గల పురాతన దేవాలయం గోడలమీద ‘శ్యతీ ఆ్దకఒళచి ఘశజూ ఆ్ద్యఖ తీజఆ రీశ్యతీ ఆ్దళ ఖశజ్పళూఒళ ఘశజూ ఆ్దళ ద్యిజూఒ’ (నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు జగ్ అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో అదే తెలుస్తుంది) అనే వాక్యం చెక్కబడి వుంది.
పై సంస్కృత వాక్యము, ఆంగ్ల వాక్యము రెండూ కలపి మనకు ఒక సత్యాన్ని బోధిస్తున్నాయి. ఈ ప్రపంచం మొత్తానికి మూలభూతమైన కేంద్ర బిందువు ఒకటి ఉంది. ప్రకృతిమాత తన బహువిధరూప పరంపరను ఆ కేంద్ర బిందువులోంచే ఒక తర్కబద్ధమైన రీతిలో ఆవిష్కరిస్తోంది. ఆ తార్కికత ఏమిటో గ్రహించి దాన్ని మాటల రూపంలో ఆవిష్కరించటం కోసం మానవుడు చేసే ప్రయత్నమే విజ్ఞాన శాస్తమ్రు. అయితే ప్రాచీన భారతీయ వైజ్ఞానికులు అనుసరించిన తర్క్ధార, ఆధునిక వైజ్ఞానికులు ఈనాడు అనుసరిస్తున్న తర్క్ధార ఒకటిగా లేవు. వాటిలోగల వైవిధ్యాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా మనం గ్రహించవచ్చు.
వేద విజ్ఞాన అధ్యయనం
కాగా, ప్రాచీన భారతీయుల విజ్ఞాన శాఖా విభాగ విధానాలను అర్థం చేసుకోవాలంటే, మనం ఆ వైజ్ఞానిక గ్రంథాలను వీలైనంత సమధికంగా సంపాదించగలగాలి. కానీ వాటిని పట్టుకోవడం ఎలా? దాని మొదటిమెట్టు, వివిధ వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యాన గ్రంథాలలో ఉటంకించిన వైజ్ఞానిక గ్రంథాల పట్టికలను తయారుచేసుకోవాలి. అలాంటి వ్యాఖ్యాతలలో భాగవత వ్యాఖ్యాత శ్రీ్ధరాచార్యుడు, భారత వ్యాఖ్యాత నీలకంఠాచార్యుడు, పంచకావ్య వ్యాఖ్యాత మల్లినాథసూరి వంటివారు ప్రముఖులు. అలాంటి వ్యాఖ్యాత రచనలను పరిశీలించటం ద్వారా మేము అలనాటి వైజ్ఞానిక శాఖల విభాగాల గురించి ఈ క్రింది తాత్కాలిక అవగాహనకు రాగలిగాము.

వేదములు: వేదానంతర వైజ్ఞానిక సాహిత్యము
ఇప్పుడు మనం ఈ శాస్త్రాల గురించి రేఖామాత్రంగా పరిచయం సంపాదించేందుకు కృషి చేద్దాము.
1.గణిత శాస్తమ్రు: దీనిలో సంఖ్యల గణితము, ప్రదేశ గణితము రెండూ కలిసే వుంటాయి.
సంఖ్యా గణితంలో అంకగణితము, బీజగణితము, జ్యామితి (జామెంట్రి), గోళాధ్యాయము (3డి జామెంట్రి), ఖగోళగణితము, గ్రహణ గణితము వగైరా విభాగాలు వుంటాయి.
ప్రదేశ గణితంలో సృష్టి విజ్ఞానము (కాస్మోలజి), ఆకాశంలోని ఖగోళీయ పదార్థాల కొలతలు, వేగాలు, క్రాంతి వృత్తాలు మొదలైనవి వుంటాయి.
కొన్ని సందర్భాలలో ఖగోళ శాస్త్ర విషయంలో ఆధునిక వైజ్ఞానికులు ఇచ్చిన గణిత సూత్రాలకంటే ప్రాచీన భారతీయులు ఇచ్చిన సూత్రాలు చాలా సమున్నతంగా ఉన్నాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. (బెంగుళూరుకు చెందిన ప్రొ.యస్.బాలచంద్రరావు గారి రచనలను ఈ సందర్భంగా గమనించవచ్చు)
ఈ రంగంలో మనకు దొరకవలసి వున్న గ్రంథాలు
1.అశనికల్పము (ఖగోళము) 2.క్షేత్రగణితము 3.ప్రకీర్ణగణితము 4.వాస్తుగణితము 5.అక్షతంత్రము 6.బీజగణితమ 7.్భన్నాధికారము 8.ఘటగణితము 9.వాల్మీకి గణితము 10.అంకగణితము 11.కూపాది గణితము 12.మిశ్రగణితము 13.సువర్ణగణితము 14.పంచాంగ గణితము 15.్ఛయాగణితము 16.తారాసిక గణితము 17.సూత్రగణితము
ఖగోళ గ్రంథాలు: 1.కౌముది 2.ఖేటసర్వస్వము 3.ఆకాశతంత్రము 4.శుద్ధవిద్యాకల్పము
2.కృషిశాస్తమ్రు (వ్యవసాయ శాస్తమ్రు)
దీనిలో ప్రకృతిసిద్ధమైన ఎరువులు, పురుగుల మందులు, వృక్షజాతుల పూర్వజన్మమలు, దోహద ప్రక్రియలు (వృక్షాలకు చేసే మానసిక చికిత్సా విధానాలు), మొక్కలకు, మేఘాలకు, సూర్య కిరణాలకు గల పరస్పర సంబంధాలు, ఈనాడు హైబ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్ వంటి పేర్లతో పిలువబడుతున్న సాంకేతిక ప్రయోగాలు వగైరా ఉన్నాయి.
3.వృక్షశాస్తమ్రు
సురపాలుడు రచించిన వృక్ష ఆయుర్వేద గ్రంథం ఈ రంగంలో ప్రసిద్ధమైంది. ఈ రచయిత కాలం 10-12 శతాబ్దాల ప్రాంతం కావచ్చు. ఇది వృక్షశాస్త్రంమీద ఒకింత సమగ్రమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. దీనిలో వృక్షాలను నాలుగు రకాలుగా విభజించారు.
ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి