Others

తెలుగునేలను తడిపిన అపర భగీరథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు కాటన్ జయంతి)
*
‘సర్ ఆర్థర్ కాటన్’ పేరు వినని తెలుగువారుండరు. అలనాడు ఆయన దాతృత్వం చవిచూడని వారు అసలే వుండరు. తెలుగు ప్రజలకు తిండి, తాగేనీరు అందించిన మహాపురుషుడు కాటన్. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి, వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిని పొలాలకు మళ్లించి, ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనదే. విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్టను నిర్మించి, సముద్రంలో వృథాగా కలిసే నీటిని సాగుకు మళ్ళించిన ధీశాలి ఆయన. కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్ట వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు, విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఎగువన ఏర్పాటైన నాగార్జున సాగర్ ఆనకట్ట నుంచి తెలంగాణలోని నల్గొండ లాంటి జిల్లాలకు సైతం సాగు,తాగు నీటి సౌకర్యం ఏర్పాటుకు కారకుడు కాటన్. తెలుగు రాష్ట్రాలలోని వారికి మాత్రమే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని తమిళులకు, కన్నడిగులకు కూడా నీటి వసతి కల్పించిన ఘనత ఆయనకే దక్కింది.
1803 మే 15న హెన్రీ, కాల్విన్ దంపతులకు కాటన్ జన్మించాడు. ఇంగ్లాండులో మత గురువులు నివసించే ‘కాంబర్‌మీర్ ఆచీ’ ప్రాంతం ఆయన జన్మస్థలం. చిన్నతనం నుంచి క్రమశిక్షణతో, యుక్తాయుక్త పరిజ్ఞానంతో పెరిగాడు. సూక్ష్మగ్రాహ్యతతోపాటు, పట్టుదల కూడా ఆయనలో ఎక్కువగా వుండేదట. కాటన్ వంశం చాలా పురాతనమైనదే కాదు, అనేక విషయాల్లో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకొన్నది కూడా. ప్రభుభక్తి, దైవభక్తి, శౌర్యధైర్యాలు, ఉన్నతాశయాలు, ఉదార స్వభావం లాంటివి వారికి వారసత్వపు హక్కులని కూడా ప్రతీతి. విజ్ఞానానికి విషయ పరిజ్ఞానం తోడైతే ఎన్నో ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వెలుగుచూస్తాయంటారు. ఆర్థర్ కాటన్ విషయంలో అచ్చం అలానే జరిగింది. 1818లో అంటే 15 ఏళ్ళ వయసులోనే ‘ఆడిన్ కాంచీ’లో ఆయన మిలటరీ శిక్షణ పొందారు. ఇండియాలో పనిచేయటానికి ముందు ఈస్టిండియా కంపెనీ ఇచ్చే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అది.
కాటన్‌కి 15 ఏళ్ళ వయసుకే ఇంగ్లాండును విడిచి, ఇండియాలో స్థిరపడే అవకాశాలు ఏర్పడ్డాయి. ఏడాది గడవకముందే సెకెండ్ లెఫ్ట్‌నెంట్‌గా పదోన్నతి పొందారు. 1820లో ‘నేల్సు’లో ఆర్డినెన్స్ సర్వే పూర్తిచేశారు. 1821లో భారత్‌కి ప్రయాణమయ్యాడు. 1822లో సదరన్ డివిజన్ చెరువుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరుగా వున్న కెప్టెన్ పుల్లరోటన్ వద్ద బాధ్యతలు చేపట్టారు. కోయంబత్తూరు, మధురై, తిరునల్వేలి, తంజావూరు, తిరుచినాపల్లి జిల్లాల్లో చెరువుల మరమ్మతు పనులు కొనసాగిస్తున్న సమయంలో బర్మాతో యుద్ధం మొదలైంది. ఆర్థర్ కాటన్ మిలటరీ సర్వీసు నుంచి వచ్చినవాడు కావటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆ యుద్ధంతో పాల్గొనమని ఆదేశాలు పంపింది. దాంతో బర్మా వెళ్ళారు. విజయంతో తిరిగి వచ్చారు. వెంటనే సెంట్రల్ డివిజన్ ట్యాంకు డిపార్ట్‌మెంటు సూపరింటెండెంట్ ఇంజనీరుగా నియమితులయ్యారు. 1828లో కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. కావేరి నది డెల్టా పథకం ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి పలువురి మన్ననలనందుకొన్నారు. కావేరి నదిపై ‘కరికాళచోళు’నిచే నిర్మించబడిన ‘గ్రాండ్ ఆనకట్ట’కు ఎగువన, దిగువన కూడా డామ్‌లు నిర్మించి, నీటిని అదుపుచేసి సాగుకు మళ్ళించగలిగారు. గ్రాండ్ ఆనకట్ట అడుగు తూములు తొలిచే సమయంలో కాటన్ అస్వస్థతకు గురై, రెండున్నర ఏళ్ళు సెలవు తీసుకొని స్వదేశం వెళ్ళిపోయారు. ఆ నిర్మాణ పనుల అతని సోదరుడైన, ఫ్రెడ్ కాటన్‌కి అప్పగించబడ్డాయి. 1832లో ఆర్థర్ కాటన్ మళ్ళీ ఇండియాకు వచ్చాడు.
ఆయన స్వదేశంలో ఆస్పత్రిలో గడిపిన కాలంలో ప్రేమలోపడ్డారు. ఎలిజబెత్ లియర్ మాంత్ అనే సంఘసేవికురాలిని ప్రేమించాడు. ఆమె గొప్ప ధన వంతుని బిడ్డ. ఆమె తల్లిదండ్రులకు వారి వివాహం ఇష్టం లేదు. వివాహం జరగకముందే ఆర్థర్ కాటన్ ఇండియా వచ్చారు. మద్రాసులో ఉద్యోగంలో చేరారు. ఆరోగ్యం మళ్ళీ చెడింది. వైద్యుల సలహామేరకు విశ్రాంతి తొరకు ఆస్ట్రేలియా వెళ్ళారు. అప్పటివరకు వారి ప్రేయసి ఎలిజిబెత్ లియర్ మాంత్ అవివాహితగానే వుంది. ఆమె పట్టుదలను గ్రహించి తల్లిదండ్రులు 1841 అక్టోబరు 29న ఆర్థర్- ఎలిజిబెత్‌ల వివాహం జరిపించారు. ఏడాదిన్నర అక్కడ గడిపాక 1843లో రెండు నెలల పాపతో కాటన్ దంపతులు ఇండియాకు వచ్చారు.
ఆస్ట్రేలియాల్లో వున్నప్పుడు ఆర్థర్ ఒక బాయిలర్ ప్రమాదంలో ఇరుక్కొన్నాడు. అది ఆయన జీవితాంతం పీడించింది. అదే సమయంలో ఆయన విశాఖపట్నంలో చర్చి నిర్మాణ బాధ్యతను చేపట్టారు. విశాఖపట్నంలో స్థిరపడ్డాక అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకొన్నారు. 1832-1942 గోదావరి నదీ ప్రాంతంలో కరువు కరాళ నృత్యం చేసింది. 1820 నాటికి ఉభయ గోదావరి జిల్లాల జనాభా 7,38,308. అదే 1842 నాటికి సుమారుగా 11 లక్షలకు పెరగాలి. అలాంటిది 5,61,041కి తగ్గిపోయింది. ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గింది. 1833లో ఆ రెండు జిల్లాల ప్రభుత్వ ఆదాయం రూ.26,91,719లు కాగా, 1842 నాటికి రూ.17,25,306కి పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం ఇలా తగ్గిపోటానికి కారణాలను నివేదించమని బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థర్ కాటన్‌కి ఆదేశాలు పంపింది. సాగు విస్తీర్ణం తగ్గటం, పొలాలు బీళ్లుగా వుండటంవల్ల, ఆకలితో అలమటించే ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారన్న విషయం విశదపరుస్తూ నివేదిక పంపారు. ‘గోదావరి నుంచి ఏటా ఎంతో విలువైన నీరు సముద్రం పాలవుతోందని, ఆ నీటికి ఆనకట్ట వేసి సాగుకు మళ్ళించగలిగితే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ప్రజల ఆకలి ఆర్తనాదాలు తగ్గుతాయి. ప్రజల ఆదాయం పెరగటంతోపాటు ప్రభుత్వ ఆదాయం కూడ పెరుగుతుంది’- అని కాటన్ సూచించారు. అదే సమయంలో గోదావరిపై ఆనకట్ట నిర్మాణం ఆవశ్యకతను కూడా వివరించారు. అనేక పరిశీలనల అనంతరం కాటన్ అభిప్రాయాలతో ఏకీభవించిన బ్రిటీష్ ప్రభుత్వం ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. 1847లో ఆనకట్ట పని ప్రారంభమై 1852నాటికి నిర్మాణం పూర్తిచేయగలిగారు. సాగు విస్తీర్ణం పెరిగింది, ప్రజలకు ఆదాయం పెరిగింది. వలసపోయిన వారు తిరిగి రావటం మొదలైంది. ప్రభుత్వ ఖజానా కళకళలాడింది. దీన్ని దృష్టిలో వుంచుకొని కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్ట నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత చూపింది. ఆ ప్రాజెక్టు పూర్తికావటంతో డెల్టా సస్యశ్యామలమైంది. ఇలా ఎన్నో ప్రాంతాలను సాగునీటి పథకాలతో ఆదుకున్న కాటన్ సేవలు చిరస్మరణీయం.

-దాసరి ఆళ్వార్‌స్వామి 93938 18199