Others

‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన పాట....
-----------------------------

‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో...’
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో టి.త్రివిక్రమరావు నిర్మాతగా విజయలక్ష్మీ ఆర్ట్‌పిక్చర్స్ వారు శ్రీదేవి, జయంతి హీరోయిన్లుగా నిర్మించిన ‘జస్టిస్ చౌదరి’ చిత్రం 28-5-1982లో విడుదలై ఒక సంచలనం సృష్టించి, ఎన్‌టిఆర్ కీర్తికిరీటంలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఒక న్యాయమైన న్యాయమూర్తిగా ఎన్.టి.ఆర్. నటన అద్భుతం, ప్రశంసనీయం. తన కుటుంబం కంటే, తన ప్రాణాలకంటే న్యాయమే తనకు మిన్న అని నమ్మిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఈ జస్టిస్ చౌదరి పాత్ర. ఒకరోజు పాపారావు అనే వ్యక్తి వచ్చి ఒక కేసులో చిక్కుకున్న తన తమ్ముడ్ని కాపాడమని అడగడానికి ఇంటికి వస్తాడు. అప్పుడు ఎన్.టి.ఆర్. ‘పాపారావు! న్యాయమనేది ఎవడి చేతిలో కీలుబొమ్మకాదు. ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడానికి. న్యాయమనేది మార్కెట్‌లో అమ్మజూపే సరుకుకాదు. ఖరీదుపెట్టి కొనుక్కోవడానికి. న్యాయమనేది అది నీ యబ్బ కన్నబిడ్డ కాదు. నువ్వు చెప్పినట్టు వినడానికి.’అని చెప్పిన డైలాగ్స్ ఎన్నటికీ మరువలేరు. అటువంటి ఎన్.టి.ఆర్. కుమారుడే స్వయంగా ఒక కేసులో చిక్కుకొని దోషిగా నిరూపించబడతాడు. తన కొడుకు నిర్ధోషి అని తెలిసిన తారుమారు చేసిన సాక్ష్యాలు వలన తన సొంత కొడుకే దోషి అని తీర్పుచెప్పి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తన కుటుంబ సభ్యులు తానిచ్చిన తీర్పుని తప్పుపడతారు. న్యాయానికి అన్యాయం చేయలేక, బంధుప్రీతి చూపలేక ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్నిపర్వతం నుండి బైటికి వచ్చిందంటూ కుటుంబ సభ్యులకు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నంలో వచ్చిన ఈ పాటలో ఎన్.టి.ఆర్. నటన అమోఘం. అందుకే ఈ పాటంటే నాకు చాలా ప్రీతి.
- కొండవలస క్రిష్ణమూర్తి పట్నాయక్, రాయగడ, ఒడిశా

--కొండవలస క్రిష్ణమూర్తి పట్నాయక్, రాయగడ, ఒడిశా