Others

యమలీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన సినిమా....
------------------------------

యమలీల
అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో విడుదలైన ‘యమలీల’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అది మరిచిపోదగ్గ సినిమా కాదు. తల్లికోసం తనయుడు పడే తపనను కథగా మలిచి తీసిన సినిమా ఇది. అంతవరకూ కామెడీ పాత్రలు మాత్రమే పోషిస్తున్న అలీని హీరోగా మార్చిన సినిమా ఇది.
చిత్రగుప్తుడు భవిష్యవాణి అనే పుస్తకాన్ని జారవిడుచుకుంటే అది అల్లరి చిల్లరగా తిరుగుతూ తన గతం తెలుసుకొని, బాగా డబ్బు సంపాదించి తల్లిని బాగా చూసుకోవాలని ఆరాటపడుతున్న అలీకి దొరుకుతుంది. దానితో అలీ కోటీశ్వరుడు అవుతాడు. చిత్రగుప్తుడు, యముడు కలిసి బ్రహ్మ ఆజ్ఞమీదట భూలోకం వచ్చి, భవిష్యవాణిని వెతుకుతూ నవ్వించడమే ఇందులోని కథ. ఇందులో లోకల్ ఎస్‌ఐగా కోట శ్రీనివాసరావు ‘నగర పౌరుల శాంతిభద్రతలు నాకు ముఖ్యం’ అంటూ లోకల్ రౌడీగా తనికెళ్ల భరణి, ‘నాచెల్లి పెళ్లి’ అనే కవిత చెబుతూ, నవ్వులు కురిపిస్తారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ మొదలైనవన్నీ కలగలిపిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.
- డి.వి.లక్ష్మీనరసింహ, నిజాంపట్నం