Others

వానాకాలం జాగ్రత్త...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానకాలం వచ్చేసినట్టే అనుకోవచ్చు. జూన్ వచ్చింది. స్కూల్స్ తెరిచారు. స్కూల్‌కు పిల్లలు వెళ్లే వేళ చినుకులు పడేవేళ ఒక్కటిగా ఉంటుంది. తిరిగి స్కూలు మూసి పిల్లలకు ఇంటికి తిరిగి వచ్చేవేళకు మళ్లీ మబ్బులు పట్టి చినుకులు తయారు అవుతాయ.
అపుడుపిల్లలు గబగబా ఆటోల్లో ఎక్కడం, లేక నడిచివెళ్లడం, టు వీలర్స్ పై ఎక్కడం హాడావుడితో ఉంటారు. అపుడే చిన్నపొన్నవాన వచ్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. టూవీలర్ మీద వెళ్లేవారికైనా, నడిచి వెళ్లేవారికైనా గొడుగు పట్టుకువెళ్లడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే వారికి వీలుగా రైయిన్ కోట్స్, గమ్‌బూట్స్, వాటర్‌ప్రూఫ్ లు వాడుకోవచ్చు. స్లిప్ప ర్లు, రబ్బరు బూట్లు ధరించకపోవటం ఎంతో మంచిది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా యువత ఈ కాలంలో స్టైల్‌ను కోరుకుంటుంది. దానికి సరిపడా టెంచ్ కోట్స్ యువతీ యువకులిద్దరికి ఈ కాలంలో ఉపయోగించవచ్చని ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతున్నారు.
ఈ కాలంలో ఫ్యాబ్రిక్ దుస్తులు మంచిదని, వెంటనే ఆరిపోతాయని ఈ డిజైనర్స్ అంటారు. అంతేకాక ఈ దుస్తులు కూడా చూడటానికి కలర్‌ఫుల్‌గా, ఆనందం కలిగించేటట్లు ఉంటాయ. అమ్మాయిలు ఈ కాలంలో కుర్తీలు, హ్యాండ్‌లూమ్ చీరలు ధరిస్తే బాగుంటుంది.
అలాగే కాంట్రాస్టింగ్ కలర్స్ కూడా ఈ కాలంలో చక్కగా నప్పుతాయి. బయటకు వెళ్లేటపుడు లూస్ టీస్, షార్ట్ కుర్తీలు ఎంచుకోవటం మంచిది. ఇక మేకప్ విషయానికి వస్తే లేయర్స్ వదిలేయండి వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంతో ఉత్తమమైన మార్గం.