Others

భావం ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ పూజ కోసం పూజ పుస్తకం పట్టుకొని
పూజ చేద్దామనుకున్నాను ప్రభు
ఇంతలో
నిశ్శబ్దంలో ఓంకార నాదం గ్రహించమని, వచించమని
ప్రవచిస్తున్న ప్రవచనకారుల ఛానల్
ఛానల్‌ను చటుక్కుమని మార్చేసిన పిల్లవానికి
ప్రశ్నించు, ప్రశ్నించు, ప్రశ్నించడం నేర్చుకోమన్న
విప్లవ భావాల అభ్యుదయవాది పిలుపుతో
మరో ఛానల్
ఠపక్‌మని కోపంతో టీవీని ఆపుచేసిన చిన్నవాడు
నిన్న రాత్రి 12 గంటలకు మోగాల్సిన అలారం
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్!

పూజకు పునః ప్రయత్నం చేశాను
ఇంతలో
ఎండలో ఎందుకు తిరుగుతున్నావని
ఎడా పెడా కొడితే
పెంకులెగిరేట్లు పెంకి పిల్లవాడేడుపు
మా బహుళ అంతస్తుల భవనం వెనుక
రోదనా నంతరం పూజకు పునః ప్రయత్నం

ఇంతలో
ఇంటిప్రక్క రైలు పట్టాలపై రైలు ధడక్ ధడక్ ధడక్ ధడక్
భవనంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుదుత్పాదక యంత్ర కర్ణ కఠోర శబ్దం
కాలువ నీరు నియంత్రించేందుకు
కందక త్రవ్వకంలో ప్రొక్లెయనర్ శబ్దహోరు
రాజకీయ నాయకుడు రైలు దిగాడట
రాకెట్లు ఎగిరాయ పెద్ద మోతతో
అసంతృప్తి ఆందోళనకారుల నినాదాలు రోడ్డుమీద
మసీదులో మధ్యాహ్నపు నమాజ్ మైకులో.

అనుకున్నా అయ్యేట్లు లేదు పూజ అని
‘చదవలేకున్నా చప్పుడుతో చికాకేస్తోంది నాన్నా’
అన్నాడబ్బాయ.
ధ్యాస చదువు మీదుంటే
విఘ్నాలన్నీ వినాశనవౌతాయ కన్నా
అర్జునుడి బాణం గురి గువ్వ కన్ను గుడ్డుమీదనే
ఎంచక్కా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ
ల్యాప్‌టాప్‌తో పనిచేస్కుంటూ ఉంటాడు పక్కింటి అంకుల్ అన్నా.
‘అమ్మ వంట చేస్కుంటూ పోపేస్కుంటూ
పలుక్కుంటూ ఉంటుంది పూజ పద్యాలను కదునాన్నా?’
అంతరార్థాన్ని ఆకళింపు చేసుకున్నా
పద్యాలు పరమాత్ముని చెవులకు చేరాయా అనికాదు,
భక్త్భివం ప్రధానం అనుకున్నా.

- వేదం సూర్యప్రకాశం, 9866142006