Others

అనుకొన్న ఫలితం రావాలంటే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికైనా ఎప్పుడైనా కాస్తంత అలసట వస్తుంది. కొందరికైతే ఎన్నో చేయాలనుకొన్నాం. కాని, సమయం సరిపోవడం లేదు. ఎన్నో ఆలోచనల్లు. వాటిని అమలుపరిస్తేనా .... అంటూ కోతలు కోస్తుంటారు. మరికొద్దిమంది. మేము ఎంతో చేయాలనుకొన్నాం. కాని, ఇదిగో వీరి వల్ల అనుకొన్నది సాధించలేకపోయాం అంటారు. ఇలా వేరొకరి మీద తోయడమో, లేక సమయం చాలలేదని చెప్పడమో కాక అనుకొన్నది అనుకొన్నట్టు గా చేయాలంటే ఒక్కటే మార్గం. ఆ పనిని గురించిన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ పనిని సాధించడానికి సమయాన్ని నిర్దేశించుకోవాలి. ప్రతిరోజు ఎంత సేపు ఆ పని గురించి సమయాన్ని కేటాయించాలో కూడా అనుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకొన్న సమయానికి ఆ పనిని చేసేయాలి. అనుకొన్న లక్ష్యం నెరవేరడానికి ఒక్కరోజు రెండురోజుల్లో పరుగులు పెట్టడం కాక ఇంట్లో వారితో కూడా చేయబోయే పని గురించి ఆలోచనలు పంచుకోవాలి. వారి సహకారాన్ని కూడా తీసుకోవాలి. ఏ పనిని ఎవరు చేస్తే మంచి ఫలితం వస్తుందో చూడాలి. వారికి ఆ పనిని అప్పగించాలి. అన్ని పనులు నేనే చేసేయాలి. అంత మంచిపేరు నాకే రావాలి అని కాక టీమ్ వర్క్ మీద దృష్టి నిలపాలి. దీనివల్ల పనిలో నైపుణ్యం వస్తుంది. అలసట రాదు. అందరూ పనిలో పాల్గొన్నామన్న తృప్తి అందరికీ కలుగుతుంది. ఒక పని గురించి నలుగురి ఆలోచన్లు కలిస్తే అద్భుత నైపుణ్యం అద్భుత ఫలితం రాబట్టువచ్చు కూడా.

-- లక్ష్మీ ప్రియాంక