Others

స్వాధ్యాయ సందోహం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
వేదోపదేశం మానవులకు అతిక్రమించరానిది. ఎందుకంటే మానవ సమాజ హితం వేదధర్మాచరణ యందే వుంది. అందుకే వేదర్షి ‘మంత్రశ్రుత్యం చరామసి’- ‘‘వేదమంత్ర ధర్మోపదేశానుసారంగా నడచుకొంటాం’ అని మరో ప్రతిజ్ఞ చేయించాడు. ఈ రీతిగా అపౌరుషేయమైన వేదం ద్వారా మానవ సమాజ శ్రేయస్సు కొరకు ఋషుల ద్వారా వేదోపదేశం చేసాడు భగవానుడు.
వేదమంత్రాల ద్వారా బోధింపబడే సద్బోధ గురూపదేశం కంటె భిన్నం కాదు. అందుకే మంత్రాన్ని వేదం గురువుగా ‘మంత్రో గురుః పునరస్తు’’ అని ఋగ్వేదం పేర్కొంది. ఏది కర్తవ్యమో- ఏది అకర్తవ్యమో తెలియనపుడు వేదమంత్రానే్న ఆశ్రయించాలి. మంత్ర శబ్దనికర్థం విచారణ చేయడమని కూడా ఉంది. అంటే ఏ పని కూడా విచారించకుండా చేయరాదని భావం. ఈ విధంగా వేదం ఈ వేదోపదేశాన్ని ఉదాహరణ పూర్వకంగా పక్షేభిరపి కక్షేభిరత్రాభి సం రభామహే’’- గడ్డిపోచ వంటి అల్పజనులతో కలిసిమెలసి చురుకుగా పనిచేస్తాం’’ అన్న వాక్యంలో వివరించింది. అంటే ఎటువంటివారినయినా అసహ్యభావంతో లేదా నీచులన్న దృష్టితో చూడమని వారి ఆంతర్యం. లోకంలో ఎంతటి నీచమైన వస్తువయినా దానికుండే ప్రాధాన్యమెంతో కొంత ఉండనే ఉంటుంది. తెలివైన వ్యక్తిదాని సహాయంతో కూడా కార్యాలను సాధించుకోగలడు.
ఈ రీతిగా ఈ మంత్రం ఒకరెక్కువ, మరొకరు తక్కువ అనే భావాలు మానవ సమాజానికి చేటు కలిగిస్తాయి. కాబట్టి వాటిని విడిచి అందరి ఎడల సమభావంతో కలసిమెలసి ప్రవర్తించండి అని మానవ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉంది.
అపశ్యం గోపామనిపద్యమానమా చ పరా చ పథిభిశ్చరంతమ్
ససధ్రీచీః స విషూ చీర్వసాన ఆ పరీవర్తి భువనేష్వన్తః
ఋగ్వేదం 1-164-31
భావం: ఆత్మ ఇంద్రియాలకు ప్రభువు. అది స్వేచ్ఛగా మంచి మరియు చెడు మార్గాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అట్టి ఆత్మను నేను తెలుసుకున్నాను. అది సుఖ-దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. శరీరాన్ని ధరించి ఆత్మ ఈ ప్రపంచంలోనికి మరల మరలా వస్తూ ఉంటుంది. ఉంటుంది. ఈ చిన్ని మంత్రంలో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి. ఈ మంత్రంలో ‘ఆత్మ’ ‘గోప’ శబ్దం చేత వ్యవహరింపబడింది.ఇంద్రియాలకు ప్రభువని దాని అర్థం. దీనిని బట్టి ఆత్మ వేరు ఇంద్రియాలు వేరని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆత్మ ఇంద్రియాలకు ప్రభువే కాని ఇంద్రియాలతో సమాన లక్షణం కలది కాదుకదా! అంతేకాక ఆత్మ ఇంద్రియాలకు రక్షకం కావడం చేత గోపశబ్దం చేత వ్యవహరింపబడుతూ ఒక ప్రత్యేకత కలిగియుంది. శరీరంలో ఆత్మ నిలిచియునన్త వరకే శరీరంలోని ఇంద్రియాలు తమ తమ పనులను నిర్వహింపగలుగుతూ ఉండటం అందరికీ అనుభవమే. దీనిని బట్టి తమప్రభువైన ఆత్మకు విధేయంగా ఉంటూ ఇంద్రియాలు సేవ చేసేవిగా ఉన్నట్టు స్పష్టమవుతుంది.
ఈ అభిప్రాయానే్న వేదం ఇంద్రియాలకు స్వయం శక్తి మత్వాన్ని మరియు శాశ్వతత్వాన్ని చెప్పక అవి ‘నాశనశీలం’ కలవని, ‘అనిపద్యమానం’ అన్న మాటతో పై మంత్రంలో స్పష్టంగా నిర్దేశించింది. కాబట్టి అశాశ్వతమైన ఇంద్రియాలు నశిస్తే శరీరం కూడా నశిస్తుంది. కాని శరీరం నశిస్తే శాశ్వతమైన ఆత్మ నశించదు. అట్లే ఇంద్రియాలు శిథిలమైనా, ఆత్మ శిథిలం కాదు. ఇదే దృష్టితో బ్రహ్మవేత్త అయిన యాజ్ఞవల్క్యుడు ‘‘అవినాశీ వా అరే- యమాత్మా- నుచ్ఛిత్త్ధిర్మా’ ( బృహదారణ్యకోపనిషత్ 4-5-14)
అర్థం: ఓ మైత్రేయి! ఆత్మ నాశనరహితమైనది. అది ఎన్నడూ నశించదు.
..........................ఇంకావుంది