Others

చివరి పేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనో నవల చదువుతున్నా...
అందులో ఓ పాత్ర
నా చుట్టూనే తిరుగుతోంది!
నా గుండెకు ఆర్ద్రత పెంచుతోంది!

చదువుతున్నంతసేపూ..
నేను మా ఇంట్లో ఉన్నట్లే వుంది!
నవలలో సంభాషణ కొత్తగా ఏమీ లేదు
కానీ చదివించే పాత్రల చిత్రణ
నన్ను చదివేలా చేసింది!

పుస్తకం సగభాగాన తటపటాయిస్తోంది!
ఎన్నో సందేహాలను నాకు నూరిపోస్తోంది!
ఏం చేస్తాను మొదలుపెట్టానుగా ఆపలేను!

నేను చదివే నవలలో నాయిక రచయిత్రి
పాఠకుల గుండెలను లోబరచుకోగల
చేయితిరిగిన కలంగల కవయిత్రి!

మధ్యతరగతి జీవితాలకు
మార్గదర్శిగా మారి
ఎన్నో నవలలు రాసి
మరెన్నో అవార్డులు పొంది
జీవితాన్ని రంగులమయం చేసుకొంది!

ఆలుమగల మధ్య ప్రేమను అక్షరీకరించి
పాత్రల నడుమ నన్నో పాత్రను చేసి
కుటుంబ నేపథ్యాల నడుమ
నేను చదువుతున్న నవల
‘చివరి పేజీ’లో నాయిక
చిరుదివ్వెగా మారి
ఆ గగన తారల్లో చేరి వెలుగుతోంది!
*

-కుంచె చింతాలక్ష్మీనారాయణ 9908830477