Others

విద్యతోనే అభివృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద బాలికలంతా బడిబాట పట్టినపుడే ఏ దైశమైనా అభివృద్ధి సాధిస్తుంది. బాలికల విద్య అన్నది ప్రచారం కోసం కాదని, దాన్ని ‘తీవ్రమైన ఆర్థిక అంశం’గా పరిగణించాలని సూచిస్తున్నారు. పేదరికం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బాలికలు పనులకు వెళుతున్నారని, సమస్యల నుంచి గట్టెక్కి గెలుపుతీరాన్ని చేరాలంటే వారంతా చదువులో రాణించాలన్నారు. చిన్నపుడు ఏ మాత్రం తీరిక దొరికినా ఏదో ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే అది మంచి విద్య వల్లే సాధ్యమని తల్లిదండ్రులు చెప్పాలి. సమస్యలు ఎదురైనపుడు నిరాశతో కుంగిపోరాదు. చదువు ద్వారానే దేన్నయినా సాధించవచ్చు అని గుర్తించాలి. మతానికో, పేదరికానికో భయపడి బాలికలు బడికి దూరం కావాల్సిన అవసరం లేదు. కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనా చదువుకోవడం బాలికల కనీస హక్కు అని గుర్తు చేస్తుకోవాలి. చాలా దేశాల్లో చదువుకోవాలనుకునే బాలికలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాల్య వివాహాలు, యుక్తవయసు రాకుండానే గర్భధారణలు, లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటివి బాలికల పాలిట శాపంగా మారుతున్నాయ. పేదవర్గాల్లో అమ్మాయిల గురించి కుటుంబ పెద్దలు అసలు ఆలోచించడం లేదు. వారిని చదువుకోనివ్వడానికి వీలు కల్పించడం లేదు. పైగా కాస్త 15 ఏళ్లు రాగానే వెంటనే వారికి పెళ్లి చేయాలని చూస్తారు కాని వారిని చదివించాలన్న ధ్యాస వారికి ఉండదు. లేకుంటే ఇంట్లో తల్లిదండ్రుల సంపాదనకు ఉపయోగపడాలంటూ దినసరి కూలికి పంపించడానికి కూడా వెనుకాడడం లేదు. ఎలాంటి సమస్యలనైనా బాలికలు భరించాల్సిన పనిలేదు. బాలికల వి ద్య కోసం మనదేశంలో ఎన్నో మెరుగైన సేవలను ప్రభుత్వం కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకుని బాలికలందరూ చదువుకుంటే అటు పేదరికాన్ని ఇటు వక్రమార్గాల్లో తిరిగే వారిని కట్టడి చేయవచ్చు. బాలికల విద్య అన్నది ప్రపంచపు సమస్య.. ప్రపంచం కదిలితేనే ఆ సమస్యకు పరిష్కారం సాధ్యం అవుతున్నదని మేధావులంతా బాలకోద్దరణకు నడుం కడుతున్నారు.

- జి. వివేక్