Others

దురాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడద’ని బైబిల్ సెలవిస్తోంది. దేవుని పది ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ ‘నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు’ - నిర్గమ 20:17
మనకు మంచి ఇల్లు కుటుంబము దాసదాసీలు ఎందరున్నా, మంచిమంచి వాహనాలు ఉన్నా పొరుగువారి వస్తువులను చూసి ఆశపడతాం. పొరుగు వారిని ఆశించేది మన హృదయానికి మాత్రమే తెలుసు. హృదయములో పుట్టే ఆశలు ఎనె్నన్నో మనకు మాత్రమే తెలుసు. ఆయా ఆశలను అదుపు చేయలేక శోధనలో పడిపోతున్నాం. ‘హృదయము అన్నిటికంటె మోసకరమైనద’ని బైబిల్‌లో చెప్పబడింది.
పొరుగు వారివి ఆశించే మనసు సాతానుడు కలుగజేస్తాడు. కలిగిన దానితో తృప్తిగా ఉండే మనసు యేసుప్రభువు ఇస్తాడు. ‘ఏ భేదము లేదు; అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారన్న (రోమా 3:23) మాట అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఉదయం నుండి రాత్రి పడుకొనే వరకు చూసినవన్నీ ఆశించకపోయినా కొన్నింటిని మాత్రం ఆశిస్తాం. దళఒళ ఘూళ పళూక ఒళషూళఆ జూళఒజూళఒ.
‘ఒక స్ర్తిని మోహపు చూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసినవాడగును’ - మత్తయి 5:28 ‘స్ర్తిని మోహపు చూపుతో ఆశగా చూస్తేనే పాపం’ అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తోంది. పొరుగువాని భార్యను ఆశించకు అనే ఆజ్ఞ చాలామందికి కష్టంగా ఉంది. ఈ ఆశను అదుపు చేసుకోలేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయి పోతున్నాయి. పొరుగు వారివి మనం ఆశిస్తే మనవి పొరుగువారు ఆశిస్తారు అన్న సంగతి మర్చిపోతున్నారు.
పొరుగు వానిది ఎద్దైనా ముద్దే. చివరకు గాడిదైనా ఇష్టమే. పొరుగువాని పుల్లకూర రుచట.
వాస్తవానికి దేవుడు ఎవరికి ఇవ్వవలసినవి వారికిస్తాడు. వాటితో తృప్తిగా ఉండలేక పోతున్నారు. తృప్తి కలిగి దేవుని స్తుతించి కృతజ్ఞతగా ఉంటే, దేవుడు ఆశీర్వదించి ఇంకా అనేక మేలులు అనుగ్రహిస్తాడు. అల కాకుండా పొరుగు వారివి ఆశపడి వారు -పులిని చూసి నక్క వాత వేసుకున్నట్టు కష్టాల పాలౌతున్నారు.
ఆశ దురాశగా మారి, దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును - అని బైబిల్ తెలియజేస్తోంది. అవ్వ చిన్న పండునకు ఆశపడి దేవుడిచ్చిన ఏదేను తోటను కోల్పోయింది. దేవునితో సహవాసం కోల్పోయింది. ఆదాము అవ్వ కష్టాలలో పడ్డారు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే మనకు కూడా కష్టాలే. ఆజ్ఞ అతిక్రమము పాపము. అది చిన్న ఆజ్ఞ అయినా పెద్దదైనా. అవ్వ చేసిన ఆ చిన్న తప్పునకు లోకమంతటికీ పాపము అలుముకుంది. ఆశపడి, తప్పులు చేసిన కుటుంబాలు ఎన్నో పతనమై పోయాయి. వారేకాదు వారి కుటుంబమంతా నష్టపోయిన సంగతులు ఎన్నో చూస్తున్నాం. వింటున్నాం. ఇక ధన ఆశ అంటారా? ఇది సమస్తమైన కీడులకు మూలము. గ్య్యఆ ళ్ఘఖఒళ యచి ఘ ళ్పజ. కొందరు దానిని ఆశించి నానా బాధలలో పడి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. దీనికంతటికీ మూల కారణము హృదయములో పుట్టే చిన్న ఆశ. అందుకే ‘వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని దేవుడు చూసి హృదయములో నొచ్చుకొని సమస్త జీవరాసులను భూమి మీద నుండకుండా తుడిచివేసెను. నీతిపరుడైన నోవాహును అతనితోకూడ ఓడలో ఉన్నవారు మాత్రము మిగిలిరి’ - ఆదికాండము 6:5. దేవుని ఆజ్ఞను పాటించి ఇతరులవి ఏవియు ఆశించకపోవడమే నీతి. కలిగిన దానితో తృప్తిగా ఉంటూ దేవుని ఉగ్రతను తప్పించుకొని దేవుడిచ్చే మహిమను అందరూ పొందుకోవాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256