Others

మస్తకంలో మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ లోకంలో అపూర్వ వ్యక్తిత్వమున్న వ్యక్తి. మనిషికి ఊపిరి ఎంత అవసరమో, జ్ఞానం మనిషికి అంతకన్నా అవసరం. సాంప్రదాయ ఆలోచనల నిధి, అంతరంగం సాహితి సన్నిధి. మనిషే సంఘజీవి. సంఘ పురోగాభివృద్ధిని ఆకాంక్షించే సాహితీవేత్త- సమాజ శాస్తవ్రేత్త - ‘రేపటి తరానికి ఒక సెర్చిలైటు’.
‘విభిన్న కోణాల్లో, అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసే, ప్రచురణ చేసే ప్రజల మస్తకంలో మనిషి’’-
బహుభాషాభిమానంతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా మాతృభాషపై అభిమానంతో 15 గ్రంథాలు రచించి, జీవితకాల రచయతగా, విశే్లషణాత్మక రచనలకు వారధి- జీవిత పరమావధిగా నిలిచారు. ఆయనే బదరీ నాథ్ గారు.
భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, చారిత్రాత్మక అంశాలు, ఎంపికలో భాషాభిమానం వ్యక్తమవుతోంది. బహుముఖ కృషితో వ్యాసకర్తగా, రచయితగా, నాయిక నవలా రచయితగా, విమర్శకుడిగా, చారిత్రాత్మక పరిశోధకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, రాజకీయ దురంధరులకు, ఆధ్యాత్మిక గ్రంథమైన బాబాగారి జీవిత చరిత్రను ప్రజలకందించడంలో సిద్ధహస్తుడు.
సాహిత్య అభిమానం నరనరాన రక్తంలో, ప్రతి కణంలో జీర్ణించుకుని, విశే్లషకుడిగా, ఎన్నో అంశాలు శోధించి, పరిశోధించి, పలు రంగాలలో విభిన్న కోణాలలో సృజియించి, తన సహృదయతను, భాషాకోణంలో ఆత్మీయంగా ఉత్తమ కృషి చేసి- నిరంతర కృషీవలుడయ్యాడు బదరీనాథ్.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, రాజకీయ, అంతరంగిక అంశాలకి ప్రాముఖ్యనిచ్చి, ఒక ఎంఫీల్, పిహెచ్‌డిలకి సరిపడా గ్రంథరూపంలో ఎన్నో కోణాల్లో పరిశీలించి, పరిశోధించి వ్రాశారు. ఎందరో ఔత్సాహికులను, రచయితలను వీరు ప్రోత్సహించారు. పరోక్షంగా ఎంతోమంది ఈయన గ్రంథాలకు డాక్టరేటుకు సహకరించి విశిష్ట స్థాయిని పొందారు. ప్రజలకోసం పురాతన చరిత్రలు అందించడంలో చారిత్రాత్మక పరిశోధనకే అంకితం, రచనారంగం ఆయన శ్వాస ధ్యాస. చారిత్రక పరిరక్షణ- యువతలో చారిత్రక ఆసక్తి పెంచడం, పంచడం ఎంతైనా అవసరం. మాతృభాషను గౌరవించే స్థాయిలో, ఆకర్షణగా భాషా ఔన్నత్యాన్ని పెంచే రీతిలో ఆయన గ్రంథాలు, నేటి, రేపటి తరాలకు మార్గదర్శకాలు. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి, పరిశోధనాత్మక వ్యాసాలకు శ్రీకారం చుట్టారు. సామాజిక చైతన్యం, భాషా చైతన్యం నేటి తరానికి అందించడంలో కృతకృత్యులయ్యారు.

- వాణి ప్రభాకరి