Others

కాదేదీ కుండీకనర్హం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కలు పెంచుకోవడం అందరికీ ఇష్టమే. ఆ ఇష్టాన్ని వ్యక్తం చేయాలంటే మంచి జాగా ఉండాలి. మట్టి, ఎరువులు అన్నీ ఉండాలి, కనీసం పెద్ద పెద్ద కుండీలన్నా ఉండాలి అనుకొంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గార్డన్ మీ ఇంట్లోనే చక్కగా ఆరేంజ్ చేసుకోవచ్చు. మీదగ్గర విరిగిపోయినా, లేదా వాడకుండా ఉన్న ఏ జాడీల్లోనో, లేదా వాటర్ బాటిల్స్‌లోనో, అదీ లేదంటే కొబ్బరి చిప్పలతోనో, ఉల్లిపాయలు వేసుకొనే ఫ్యాస్టిక్ బుట్టలు ఏదైనా వస్తువు కావచ్చు.
వాటిని తీసుకోండి. మంచి మట్టి వేయబోయే మొక్కకు వేయాల్సిన ఎరువులు రెండింటిని కలపండి. అనుకొన్న కుండీలు అంటే మనకిష్టమొచ్చినవే ఉదాహరణ ఫ్యాస్టిక్ బుట్ట తీసుకొన్నారనుకోండి. దానికి వాడి పారేసిన ఇనుప పీచు ఉంటుంది కదా దాన్ని బాగా చుట్టండి. అదీ లేదు అనుకొంటే పూలు అల్లుకునే దారాన్ని తీసుకొని చిక్కగా ఆ బుట్టకు చుట్టండి. ఇపుడు దానిలో ఎరువులు కలిపిన మట్టి పోయండి. అందులో మొక్కనుంచండి. కాసిని నీళ్లు పోయండి. ఆ మొక్క చక్కగా ఎదుగుతుంది. ఇప్పుడీ బుట్టకు అటు ఇటు దారాలు కట్టి ఇంట్లో లోనో, లేదా బాల్కనీలోనో లేదా కిటీకీల పక్కనో తగిలించండి. అటు చూడడానికి అందంగా ఉంటాయి. మంచి పూలు పూస్తుంటాయి. వీటిని కాసేపు ఎండలో మూడు రోజులకు ఒకసారి పెట్టండి.
అదీ కాకపోతే ఇండోర్ ఫ్లాంట్స్ తీసుకోండి. వాటికి ఎక్కువ నీరు అక్కర్లేదు. ముందుగా కాస్త నీరు పోస్తూ ఎరువులు కలిపిన మట్టి లో మొక్కనుపెట్టి దాన్ని బాగా గట్టిగా చేతులతో నొక్కండి వేర్లకు మట్టి అతుక్కుని మంచి బాల్ గా కనిపిస్తుంది. అపుడు దాన్ని కొబ్బరి తీసేసిన చిప్పల్లో పెట్టి ఆ కొబ్బరి చిప్పపైన కూడా మట్టి అతకబెట్టవచ్చు. ఆ మట్టిపై చక్కని దారాన్ని చుట్టండి ఇంకా కావాలంటే కొబ్బరి పీచును కూడా వాడవచ్చు. ముందు పీచు చుట్టి దానికి దారాన్ని చుట్టాలి. ఇపుడు అనుకొన్న షేప్‌ను వచ్చేట్లుగా దాని ఆకారాన్ని మార్చుకోండి. ఇపుడు దానికి పొడవైన దారాలను కట్టి గుమ్మాల దగ్గర తగిలించండి. అతిథులకు ఆహ్వానాన్ని ఈ మొక్కలు పలుకుతాయి. ఇవి ఇంకా తీగలాగా సాగే మొక్కలైతే మరింత అందంగా ఉంటాయ. వాడేసిన వాటర్ బాటిల్స్‌ను కూడా మొక్కల పెంపకానికి ఉపయోగించవచ్చు.
ఇలా ఏ వస్తువునైనా చక్కని కుండీగా మార్చుకుని చిన్న చిన్న అందమైన మొక్కలను పెంచుకోవచ్చు. మంచి పూలు, రంగురంగుల ఆకులు గలిగిన మొక్కలను కనువిందుగా పెంచుకుని మనసుకు ఆహ్లాదాన్ని కలిగించుకోవచ్చు. సువాసన వెదజల్లే మొక్కలను పెట్టుకున్నట్లయతే ఇల్లంతా మంచి పరిమళంకూడా వ్యాపిస్తుంది. ఇంట్లో జాగా లేదని బాధపడక్కర్లేకుండా వీటిని చక్కగా హ్యాగింగ్స్ మొక్కలుగా పెంచుకోవచ్చు. ఇలా ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీకూడా దూరమవుతుందని చెప్తారు.

--జి.కల్యాణి