Others

బాలయ్య బిజీ బిజీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ ఎంత యాక్టివో అన్నది అందరికీ తెలుసు. వరసగా సినిమాలు చేస్తూనే సినిమా వేడుకల్లో ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. నిజంగా ఆయన సూపర్ స్పీడ్‌ని చూసి నేటి యువతరం ఎంతైనా నేర్చుకోవాలి. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారనున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. మహానటుడు ఎన్టీఆర్ జీవితకథతో తెరకెక్కే బయోపిక్ ఈమధ్యే మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ సినిమాకు బ్రేక్‌లు పడ్డాయి. దాంతో వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. జూన్‌లో ఈ సినిమా మొదలుకానుంది. దాంతోపాటు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా బాలయ్యతో నెక్స్ట్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను, బాలయ్య కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. బాలయ్య కెరీర్ బెస్ట్ చిత్రాలను అందించిన బోయపాటి ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వినాయక్ సినిమా తరువాత బోయపాటి శ్రీను సినిమా పట్టాలు ఎక్కనుంది? సో.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.