Others

బాధ్యులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే..
కఠినమైన చట్టాలున్నాయంటారు
కనిపిస్తే ‘కాల్’ చేయమంటారు
స్కానింగ్ సెంటర్ల కనికట్టు
విషయంలో..

భ్రూణ హత్యల పేరుతో
ఆడ శిశువుల పిండాన్ని
అదిమేసి చిదిమేసిన
బాధ్యులెవరు?

భర్తనా.. అత్తమామనా?
ఆడబిడ్డలా.. సమాజమా..?
కని పెంచే స్తోమతలేని
కన్నవారిదా?
మనకెందుకులే అనుకునే
‘మానవ’ సమాజానిదా?

పూట గడవడానికి
గర్భస్రావాలు చేసే
మంత్రసానిదా? లేక
చట్టం మనకు చుట్టమనే
స్కానింగ్ సెంటర్లదా?

ఆలోచించండి.. ఆపండి...
ఆడశిశువుల హత్యలను.

-ఉషశ్రీ తాల్క