AADIVAVRAM - Others

ఎదుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరగడం వేరు. ఎదుగుదల వేరు.
కొంతకాలం తరువాత శారీరకంగా పెరగడం ఆగిపోతుంది. వయస్సు పెరుగుతూనే ఉంటుంది. వయస్సు పెరిగినంత మాత్రాన ఎదుగుదల వున్నట్టు కాదు.
మనం ఎదగాలి అనుకోవడం మన మీదే వుంది. ఉద్యోగం వచ్చేంతవరకు కొంతమంది విపరీతంగా చదువుతారు. ఆ తరువాత చదవడం మానేస్తారు. ఎందుకంటే మళ్లీ కొత్త ఉద్యోగం ఏమీ రాదు.
అందుకని తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నం చేయరు. ప్రస్తుతం వున్న పరిస్థితి బాగుందని తమ స్థాయి సరిపోయిందని అనుకుంటూ ఉంటారు. తాము వున్న పరిస్థితి అనుకూలంగా వుందని అనుకుంటూ వుంటారు.
కొత్త పుస్తకాలు చదవరు. కొత్త వ్యక్తులతో సంభాషించరు. తమ మేధస్సు పరిధిని పెంచుకోవడానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేయరు.
ఎదుగుదల అనేది ఐచ్ఛికమైనది. మనం ఎదగాలి అన్న కాంక్ష మనలో వుండాలి. అలా వున్నప్పుడు ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగాలి.
ఎదగాలంటే మనం కొత్త తరంతో పోటీ పడాలి. పోటీ పడకపోయినా వాళ్లతో ప్రయాణం చేయాలి.
ఎందుకంటే-
ఈ రోజు వున్న నైపుణ్యం రేపటికి పనికి రాకపోవచ్చు.
ఈ రోజు ఆలోచనలు రేపటికి పాతవిగా మారిపోవచ్చు.
ఈ రోజు వున్న ప్రమాణాలు రేపటికి మారిపోవచ్చు.
శరీరం కాలినప్పుడు నీళ్లు పోయాలన్నది గతంలో లేదు. ఇప్పుడు మారిపోయింది.
ఈ రోజు ఆరోగ్యకరమని చెప్పింది రేపు అనారోగ్యకరంగా పరిశోధనలు తేల్చవచ్చు.
ఎదగాలంటే - ఎదగాలన్న కోరిక వుండాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి.
నిలకడగా వుండాలంటే వుండవచ్చు. అది మన ఇష్టం. కానీ అది మంచి కాదు.
ఎదగడం అత్యంత అవసరం.
ఎవరెస్టు కూడా ప్రతి సంవత్సరం కొంత ఎదుగుతుందని అంటారు.
మరి-
మనం ఎదగకూడదా?

- జింబో 94404 83001