Others

సంకల్పం ఉండాలే గానీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనారణ్యంలో అన్నీ కాంక్రీటు భవనాలే కనిపిస్తాయి. రోడ్డువైపు చూస్తే అన్నీ భారీ వాహనాలే కనిపిస్తాయి. రోడ్టున నడిచివెళ్లేవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దగ్గర దారి అయిన సరే బుర్రుమని బండీ తీస్తారు. అలా రోడ్లన్నీ చిన్న పెద్దవాహనాలతో నిండి పోయి ఉంటాయి. ఇక ఇల్లు చూద్దామంటే ఇళ్లమీద ఇళ్లతో అన్నీ అపార్ట్‌మెంట్స్ ఎక్కడ కాస్తంత జాగా కూడా లేకుండా సిమెంటు, రాళ్లు ఇలా ఏదో ఒకదానితో భూతల్లిని కప్పేస్తుంటారు.
చూడాల్సిందే అన్నా మట్టి కరువు కనిపించదు.
కాని సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇట్లాంటి అపార్ట్‌మెంట్లల్లోనూ నేడు వ్యవసాయదారులు పుట్టుకొస్తున్నారు. వారంతా కూరగాయలు, పండ్లు, పూలు మాత్రమే పండిస్తున్నారు. వీరి పండించేచేను మిద్దెతోట. అంటే ఇంటి పైభాగంలో ఫ్లాస్టిక్ కుండీలు, ట్రేలు, ఇతర వ్యర్థమైన జాడీలు, సీసాలు వాటిని వాడుతూ ఇంకా సిమెంటు తొట్లు కూడా పెట్టుకుని అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఈమిద్దె తోటలపై ఆసక్తిని పెంచడానికి తెలంగాణ ఉద్యానవన శాఖ గ్రోబ్యాగులు సబ్సీడి లో ఇస్తున్నారు. ఎవరి వీలును బట్టి వారు ఈ మిద్దె తోటలను పెట్టుకుంటే క్రిమి సంహారక మందులు, త్వరగా పండించాలన్న ఆతురతో వేసే హానికారక మందులు లేకుండా స్వచ్ఛమైన వాతావరణంలో కూరగాయలు పండించుకోవచ్చు. పూలను పూయించుకోవచ్చు. దీనివల్ల అటు ఆరోగ్యమూ ఇటు మానసికానందం కలుగుతాయి.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- లక్ష్మీ ప్రియాంక