Others

స్వాధ్యాయ సందోహం-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
అనగా ఎములగూడుగా కనబడే ఈ సృష్టిలోని సమస్త వస్తుజాలానికి ఎముకలే లేని ఈ అప్రాకృత పదార్థానికి ఏది కారణమై యున్నది? ఈ ప్రాణాలు, రక్తం భూమి నుండి అంటే ప్రకృతి సిద్ధంగా పుట్టినవే. ఆత్మ అన్నది ఎక్కడుంది? ఈ విషయాలను తెలుసుకొనేందుకు సర్వజ్ఞుడైన విద్వాంసుడిని ఎవడు ఆశ్రయిస్తున్నాడు?
వివరణ: సృష్టి ఎంత విచిత్రమైనదంటే మానవుని మేధస్సునకేమాత్రం అందనంత రహస్యమై ఉంది. సృష్టి ఆరంభం నుండి తత్త్వవేత్తలు సృష్టి రహస్యాన్ని కనుగొనేందుకు నిమగ్నమైపోయారు. అలా వారు కనుగొన్న సృష్టి రహస్యాలను మానవ సమాజ దృష్టికి తీసుకొని వస్తూ వున్నారు. మనిషిలోని బుద్ధిబలం సాటిలేనిది కాకపోయినా గొప్ప బుద్ధిబలం మాత్రముందని అంగీకరించక తప్పదు. ఎలాగంటే- మహాసముద్ర గర్భాలలోకి ప్రవేశించి వానిని సంపూర్ణంగా పరిశోధించాడు. నింగికెగిరి తారకల విశేషాలను కొనుగొన్నాడు. అంగారక గ్రహవాసులతో మాటలాడి వారితో సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. పర్వతాలను సహితం పిండికొట్టేవాటికి ఆవగింజల లాగ మార్చేస్తున్నాడు. మహారణ్యాలు సహితం మనిషి బుద్ధి వైభవం ముందు పల్లెల్లో ఉండే ఒక చిన్న పొలం కంటే కూడా చిన్నవి అయిపోయాయి. భూమి చివరన ఉండే ధ్రువాలు కూడా అస్థిరంగా అయిపోయాయి. నీరు - నిప్పు - గాలి- నేల కూడ సేవకులుగా మారిపోయాయి. నదీ ప్రవాహ గతులను మార్చివేశాడు. ఎండలతో మండే ప్రదేశాలు - నిప్పులు కురిసే వేడి అతడిని బాధించలేకున్నాయి. నిత్యం సంచరించే వాయువును కూడ బంధించివేశాడు. అఖండమైన కాలధీశుణ్ణి కూడ క్షణం - నిమిషం- ఘంటాది పరిమాణాలతో కొలిచి చెప్పగలిగాడు. సృష్టిలోని అనంతమైన అంతరిక్షాన్ని చిన్న చిన్న ప్రదేశాలుగా విభజించాడు. తన యుక్తితో విశ్వానే్న ఒకచిన్న పల్లెగా కుదించివేశాడు. ఈ విధంగా దేశ- కాలాదులపై విజయాన్ని సాధించిన కారణంగా సమస్త జీవకోటిపైన తన అధికారాన్ని నిలబెట్టుకొన్నాడు. దాని ద్వారా మానవుడు గర్వోన్నతుడై వెలిగిపోతున్నాడు. నిజమే. మనిషి తన విజయాలకు గర్వింపదగినవాడే. కాని గర్వం మాత్రం తగినది కాదు. ఎందుకంటే సృష్టిలో మానవుని శక్తికంటే మించిన మహోన్నత శక్తి ఏదో ఒకటి ఉంది.
ఓరి పిచ్చి మనిషీ! అట్టి శక్తి ఏదో అసలు నీవెవరివో ఎప్పుడైనా ఆలోచించుకొన్నావా? లేదు కదా! సముద్రాలను కూడా మధించేవాడా! ఇంతకూ నీవెవ్వడవో చెప్పు. కొండలను సహితం పిండి కొట్టిన ఘనుడా! ఘనమైన నీ రూపమెంత? ఎప్పుడైనా నిన్ను నీవు పరిశీలించుకొన్నావా? నీ శరీరం క్రమంగా శిథిలమై నశించిపోయేదే. అది కేవలం మట్టితో చేయబడింది. ఆ మట్టికి నిప్పు, నీరు, గాలి తోడు అయ్యాయి. మరి ఈ శరీరమెలా తయారయిందో నీవెప్పుడైనా ఆలోచించావా? అసలిది మొట్టమొదట ఎలా- ఎందుకు పుట్టిందో విచారించావా? అచేతనమూ, జ్ఞానవిహానమూ, అనుభూతి శూన్యమూ అయిన జడపదార్థ పరిణామం కదా ఈ శరీరం?
ఆత్మ ఈ శరీరంలో ఉండి ‘నేను - నేను’; ‘నాది - నాది’ అని అంటూంది. అలా అంటున్నదేదో- ఎవరో ఈ శరీరాన్ని కోసి పరిశీలించావా? ఆ రీతిగా చూచినా ఆ ఆత్మ కనిపించిందా? అసలు కనిపిస్తుందా? అయితే ఈ శరీరంలోని నరాలు - నాడులు మొదలగువాని లక్షణాలను తెలుసుకొనేందుకు శస్తచ్రికిత్సలు చేసే పద్ధతులు నేర్చుకొనేందుకు వైద్య గురువుల వద్దకు వెళ్లి తెలుసుకొన్న రీతిగా ఈ విషయాలను తెలుసుకొనేందుకు ఏ గురువుల వద్దకైనా వెళ్లావా? వెళ్లి అడిగి తెలుసుకొన్నావా? అరే.. ఈ శరీరం ఎముకలతో నిర్మాణమయింది. మరి ఆ ఎముకల అవసరమేముంది? ‘అస్థన్వం యదనస్థా బిభర్తి’- ‘ఎముకల సముదాయంతో నిర్మితమైన సృష్టిలోని సర్వజీవ పదార్థాలను ఎముకలు లేని ఒక దివ్య తత్త్వం నిత్యమూ వహ్తింది’ అని చెప్పిన వేదవాక్యార్థాన్ని అర్థం చేసుకో. మానవ శరీరాన్ని కోసి చూస్తే నీకు మాంసం- ఎముకలు దర్శనమిస్తాయి.
*