Others

సందేహాలకు సమాధానమే.. ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి తరగతి గది తన పరిసరాల్లో ఉన్న ప్రతి విద్యార్థి ఒక కాల్పనిక శక్తిగల పౌరుడుగా కావాలని కోరుకుంటుంది. కాల్పనికశక్తి ఎలా వస్తుంది? కొందరికి అకస్మాత్తుగా ఒక భావన ఆలోచనల్లో మెరుస్తుంది. అలాంటివారే ఐనిస్టన్‌లు అవుతారు. కానీ ప్రతివారూ ఐనిస్టన్ కాలేరు కదా? కాల్పనిక శక్తికావాలంటే ప్రతి విద్యార్థి తనలోని మనిషికి తన ఆలోచనలు చెప్పాలి, తనకుతానే పాఠం చెప్పుకోవాలి. అప్పుడే ఎన్నో సందేహాలు బైటకు వస్తాయి. ఆ సందేహాలే ప్రశ్నలుగా రూపొందుతాయి. ఆ ప్రశ్నల బోధనే కాల్పనిక ఆలోచన. ఒక పుస్తకం నుంచి నేర్చుకున్నది, ఒక మనిషి నుంచి నేర్చుకున్నది కాల్పనిక శక్తికాదు. తనంతట తానే ఆ జ్ఞానాన్ని ఫోకస్ చేయగలగాలి. కాల్పనిక ఆలోచనకు మూలం సెల్ఫ్ స్టడీ. జరిగిన సంఘటనలను వౌనంగా పునరాలోచించాలి. కొత్త నీరుగా ప్రవహించే ఆలోచనలే కాల్పనిక ఆలోచనలు. తరగతి గది వౌన ధ్యానంలోకి పోతేనే అది క్రియేటివ్ క్లాస్ అవుతుంది. ఎక్స్‌లెన్సీ రావాలంటే తరగతి గది వౌనముద్రలోకి, ధ్యానంలోకి మారాలి. వౌన స్థాయిలో ఏర్పడిన సందేహాలకు వచ్చే జవాబే ఆవిష్కరణ.
మానవత్వం నేర్పుతుంది..
కొంతమంది తల్లిదండ్రులు తాము ఎంత సంపన్నులైనా తమ పిల్లలను సర్కారీ స్కూల్‌కే పంపుతారు. సర్వేల్ నాగిరెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి సంపన్న కుటుంబాలలో దొరకిన సద్గుణాలు తమ పిల్లలకు అబ్బాలనే కోరిక. తరగతి గది అందరికీ మానవత్వం నేర్పుతుంది. పేద పిల్లలతో తిరగటం వలన డబ్బున్న పిల్లలకు జీవితం గురించి తెలుస్తుంది. కరువు, శ్రమ, ఆకలి లాంటి వాటిని చూడటం వల్ల తమ భోగభాగ్యాలను త్యజించి మహాత్ములుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తరగతి గది ఎవరికి ఏది లేదో అది ప్రసాదిస్తుంది. పేదల జీవితాలలోనే మార్పు వస్తుంది అనుకోవద్దు, తరగతి గది పేద పిల్లల పక్షపాతి అనుకోవద్దు. గుడ్డివానికి చూపునిస్తుంది. సంపన్నునికి మానవత్వం చూపిస్తుంది. కొంతమంది సంపన్న కుటుంబంలో పుట్టినాకానీ గొప్ప సమాజ సేవకులు కావటానికి తరగతి గదే కారణం. తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వాళ్ల అన్న రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు ఒక ఫ్యూడల్ వ్యవస్థ పుట్టినవారు. తరగతి గది ప్రభావంతో వారిలో పరివర్తన వచ్చింది. తరగతి గది లక్ష్యం పరివర్తన. కాగా, అందరిలో పరివర్తన వస్తుందా? అన్నది అనుమానాస్పదమే. కొందరు అవకాశాలు కల్పించినా వదులుకుంటారు. తరగతి గది అందరికీ అవకాశాలు కల్పిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు.
ప్రశే్న భవిష్యత్తు..
పిల్లలు ఎన్ని ప్రశ్నలు కురిపిస్తే తరగతి గది అంత శోభాయమానంగా తయారవుతుంది. ప్రతి ప్రశ్న వెనుక ఒక కాల్పనిక శక్తి ఉంటుంది. ఆ శక్తే కొత్త జ్ఞానానికి మూలమవుతుంది. ప్రశ్నకు జవాబు ఏ పుస్తకంలోనైనా దొరకవచ్చు, ఏ టీచర్ అయినా చెప్పవచ్చు, కంప్యూటరైనా చెప్పవచ్చు. జవాబు గతానిది. ప్రశ్న భవిష్యత్తుది. ప్రశే్న తరగతి గదికి కొత్త మార్గాన్ని చూపిస్తుంది.
ప్రశ్నలను ప్రోత్సహించండి.. ప్రశ్నలను విశే్లషించండి..
విశే్లషణే కొత్త జ్ఞానానికి ఊట. ప్రశ్నలు విభిన్నంగా ఉంటేనే
ఆలోచనలు మొలకెత్తుతాయి. ప్రశ్నలు లెర్నింగ్‌కు మూలం.
తరగతి గది పిల్లల కోసం గానీ ఉపాధ్యాయుల కోసం కాదు. తరగతి గదిలో చర్చాంశాన్ని పిల్లలే నిర్ణయిస్తారు. ఉపాధ్యాయుడు కేవలం పుస్తకం వరకే పరిమితమైతే పిల్లలను గతంలోకి తోసేసిన వాడౌతారు. వర్తమానాంశాలతో జోడిస్తే పిల్లలు ‘ఎలివేట్’ అవుతారు. దానివల్ల తరగతి గదికి ఆక్సిజన్ లభించినట్లవుతుంది. తరగతి గదికి విద్యార్థే ఆక్సిజన్. తరగతి గదికి ప్రశే్న భవిష్యత్తు.

-చుక్కా రామయ్య