Others

క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనుషుల అపరాధములను మనము క్షమించిన యెడల దేవుడు మన అపరాధములను క్షమించును’ - మత్తయి 6:14 మనలను, మన పిల్లలను మాత్రం అందరూ క్షమించాలి. మనం మాత్రం క్షమించము. ఇతరుల తప్పునకు విసరడానికి రాయి పట్టుకుంటే, మన విషయంలో కూడా అదే జరుగుతుందని మర్చిపోతాం. దేవుడు మనలను క్షమించాలంటే ఒక షరతు - మనం ఇతరులను క్షమించాలి. ‘మన కంటిలో దూలము ఉంచుకొని.. ఇతరుల కంటిలో నలుసుని వెతుకుతాం’ - అంటే తప్పుల్ని మాత్రమే ఎంచుతాం. క్షమించటం మనకి తెలీని విషయం. మనం ఇష్టమొచ్చిన రీతిన ఇతరులపై విరుచుకుపడతాం. ఇతరుల మాటల్లో తప్పులను వెతుకుతాం. బైబిల్‌లో ప్రభువు చెప్పిన ఉపమానం చూద్దాం.
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో - ఒక రాజు లెక్క చూసుకొన మొదలుపెట్టినపుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. తలాంతు అంటే ఇంచుమించు రూ.3600. అంటే పదివేల తలాంతులు అనగా మూడు కోట్ల అరువది లక్షలు. ఇంత మొత్తం చెల్లించటానికి అతనికి కష్టంతో కూడుకున్న పని. అతడి జీవితంలో ఏ విధంగానూ దాన్ని తీర్చే స్తోమత లేదు. ఐతే- ఆ రాజు దయతలచి అతను చెల్లించాల్సిన పదివేల తలాంతులను మాఫీ చేశాడు. అంటే క్షమించి అతణ్ణి విడిచిపెట్టాడు. యేసు ప్రభువు కూడా మన పాపాలను క్షమించి విడిచిపెడుతున్నాడు. కానీ - ఆ వ్యక్తి రాజు సముఖంనుంచి బయటికి వస్తూ - అతనికి రుణపడి ఉన్న మరో వ్యక్తిని తాలూకు తలాంతుల గురించి ప్రశ్నించాడు. ఆ వ్యక్తి చెల్లించాల్సిన తలాంతులు అతికొద్ది. రాజు తనను క్షమించినట్లుగానే ఆ వ్యక్తిని కూడా క్షమించవచ్చు. ఐతే - అతడు అలా చేయలేదు. ఆ వ్యక్తిని క్షమించలేదు. మన తీరు కూడా ఇంతే.
మన పాపపు చూపులు.. పాపపు నడత.. పాపపు పనులు.. అన్నీ దేవునికి బాహాటంగా తెలుసు. హృదయ రహస్యా లను పరిశోధించగలడాయన. ఈ భూమీద ఉండి మనం చేస్తున్న పాపాలను ఎక్కడో ఉన్న ఆయనకి ఎలా తెలుస్తాయి? ఇదీ మానవుని ప్రశ్న. అర్థంలేని అజ్ఞానపు ప్రశ్న. మానవుల పాప పరిహారార్థం ఆయన బలి అర్పించాడన్న విషయాన్ని మర్చిపోతుంటాం. క్షమా గుణం ఉండదు. మరి మనకు పాప క్షమాపణ ఎలా దొరుకుతుంది? వాటినన్నింటినీ ప్రభువు క్షమించాలంటే మనం చేయవలసింది ఒక్కటే. ఇతరుల పట్ల క్షమాగుణం అలవరచుకోవటం. ఎటువంటి పుణ్యకార్యాలు చేసినా మనకు క్షమాపణ దొరకదు. కానీ ఇతరులను క్షమించటం ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుందని ప్రభువు సెలవిస్తున్నాడు. తన అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు (సిలువపైన చిందించిన) రక్తము చేతనే క్షమాపణ దొరుకుతుంది.
మత్తయి 18:26 - కాబట్టి ఆ దాసుడు రాజు ఎదుట సాగిలపడి మ్రొక్కి నా యెడల ఓర్చుకొనుము నీకంతయు చెల్లించెదనని చెప్పగా, ఆ రాజు దాసుని 3.6 కోట్ల అప్పును క్షమించి విడిచి పెట్టాడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు (రూ.50) అచ్చియున్న వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అతడు ఎంతగా బ్రతిమాలినా ఒప్పుకొనక వానిని చెరసాలలో వేయించెను. ఈ సంగతి తెలిసిన రాజు, ‘చెడ్డదాసుడా! నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని క్షమింపవలసి ఉండెను. కాని క్షమించలేకపోయావు గనుక చెఱసాలకు పంపుచున్నాననెను. పెద్దవారు ఏమైనా చేయవచ్చు. కానీ చిన్నవారు చేస్తే క్షమించరు. దేవుడు మన తప్పులను క్షమించకపోతే మన ము బ్రతికి యుండేవారమా?
వాస్తవానికి అందరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. అంటే శిక్షకు పాత్రులమే. కానీ దేవుని అపారమైన ప్రేమ మనలను క్షమిస్తుంది. దేవుడే మనలను క్షమిస్తూ ఉంటే మనము తోటివారిని, అన్నతమ్ములను, అక్కచెల్లెళ్లను, భార్య/్భర్తను, పిల్లలను, పెద్దలను అందరినీ క్షమించి దేవుని క్షమాపణను పొందుకుందాము. క్షమిస్తున్నాడు గదాని మరల మరల తప్పులను చేయకూడదు సుమా! క్షమాపణ గుణం ఉంటే మనసు సమాధానముగా నెమ్మదిగా ఉంటుంది. లేకుంటే హృదయంలో మంటలు చెలరేగుతూ ఉంటాయి. అది మన దేహానికి హానికరము. ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా క్షమించిన యేసుప్రభువే మనకు మాదిరి. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా క్షమించడం అలవరచుకొందాం. 50 రూపాయలంత ఇతరుల చిన్నచిన్న తప్పులని క్షమిస్తే.. 3.6 కోట్ల విలువైన తప్పులను దేవుడు క్షమిస్తాడు. ‘ఎదుటివారు క్షమించలేదు. కాబట్టి నేనెందుకు క్షమించాలి’ అన్న ఆలోచనలోనే ఉంటున్నామా? ఎంత పాపిపైనా క్షమిస్తానని చెప్పిన ప్రభువు మాట చొప్పున క్షమించటం నేర్చుకొందాం. దేవుని క్షమాపణ ఆశీర్వాదం పొందుకుందాం.

-మద్దు పీటర్ 9490651256