Others

మానవతావాధి భగవద్రామానుజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయా కాలాలలో ఋషితుల్యులైన మహనీయులెందరో జన్మించారు. వారిలో త్రిమతాచార్యులుగా ప్రసిద్ధి చెందిన శ్రీశంకరాచార్య శ్రీరామానుజాజార్య, శ్రీమధ్వాచార్యులు ముఖ్యులు. నాటి సనాతన ధర్మాన్ని బౌద్ధ, జైన, శూన్య, వామాచార సిద్ధాంతాలతో భ్రష్టుపరుస్తున్న సమయంలో జన్మించి వైదిక ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని పరీవ్యాప్తం చేశారు. విధర్మీయులనుండి సనాతన ధర్మాన్ని కాపాడిన ధర్మనీరుల్లో ముఖ్యులు శ్రీరామానుజాచార్యులు.
తమిళనాడులోని పెరంబుదూరులో కేశవసోమయాజులు, కాంతిమతి దంపతులకు పుత్రకామేష్ఠి యాగఫలంగా జన్మించారు. కాంతిమతి సోదరుడు మహాభక్తుడు అయిన శ్రీశైలపూర్ణులు మేనల్లుణ్ణి చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ పసివాని శిరస్సు చుట్టూ దివ్యమైన కాంతి వ్యాపించి ఉండడం, అందులో ఆదిశేషుని రూపం ప్రకటితమవడం కనులారా చూసి, ఈ పసివాడు సాక్షాత్తు లక్ష్మణాంశగా జన్మించాడని నిర్థారణకు వచ్చాడు. ఆ పసివానికి రామాజనుడని నామకరణ కూడా చేశాడు.
ఆదిశేషుని అంశగా అవతరించిన ఆతనిలోని ఈ ప్రత్యేకత శ్రీశైలపూర్ణలు ప్రత్యక్షంగా ఆకళింపు చేసుకున్నారు. పెరుంబుదూరులో తిరుక్కచ్చినంబి అను గురువు వద్ద బాల్యంలో విద్యాభ్యాసం చేశారు. ఏకసంథాగ్రాహి కావడంతో గురువు వద్ద షడ్వార్తలు ఆమూలాగ్రంగా నేర్చుకున్నారు. కంచిలో సుప్రసిద్ధమైన అద్వైత పండితులు యాదవ ప్రకాశకుల వద్ద విద్యాభ్యాసం కొనసాగించారు. రామానుజులకు గల అసమాన మేధాసంపత్తిని గుర్తించిన గురువులకు ఈర్ష్యాద్వేషాలు రగిలి సహించరాని స్థితికి తెచ్చేయి.
ఒకసారి యాదవ ప్రకాశకులు తైత్తరీయోపనిషత్తులోని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అను సూక్తికి చెప్పిన వ్యాఖ్యానంతో రామానుజలు ఏకీభవించలేదు. ఎర్రదనము, మెత్తదనము, సువాసన అను లక్షణాలు ఒకే పూవులో వున్నట్లు సత్యం, జ్ఞానం, అనంతం అను లక్షణాలు బ్రహ్మంలో ఉన్నాయని వేదాలలోని ఉదాహరణలు ఉటంకిస్తూ వ్యాఖ్యానం చేసే సరికి యాదవ ప్రకాశకులకు ఆగ్రహం కలిగింది. రామానుజలవారి కీర్తి వ్యాప్తినొందడంతో శ్రీరంగంలోని అళవందారనే వైష్ణవ భక్తుడు మఠాధిపతి అతడు కారణజన్ముడని గ్రహించాడు. తనకు కూడా అవసాన దశ సమీపించిందని భావించి, పీఠాధిపత్యాన్ని అప్పజెప్పాలని భావించాడు. తన శిష్యులతో రామానుజులను వెంటనే తీసుకురమ్మని చెప్పారు. ఆ వర్తమానం అందుకుని రామాజనులు వచ్చేసరికి అళవందారు పరమపదించారు. రామానుజులకు వారితో మాట్లాడే భాగ్యం లభించలేదని ఎంతో బాధపడ్డారు. రామానుజులకు ఆశ్చర్యకరమైన దృశ్యం కంటబడింది. అళవందారు కుడి చేతివేళ్ళు మూడు మాత్రమే ముడుచుకుని ఉన్నాయి. ఆయన చూపు గమనించిన శిష్యుడొకరు గురువుగారికిగల మూడు ఆశయాలను తరచూ చెప్పేవారని, ఆ ఆశయాలు నెరవేర్చగల సమర్థులు రామానుజులేనని అంటూండేవారు. అందుకే తమర్ని పిలిపించుకున్నారని, తమ కోరికలు చెప్పకుండానే వారు వెళ్లిపోయారని అన్నాడు. రామానుజులు తన లక్ష్యాన్ని సాధించడానికి, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించడానికి సరియైన గురువుకోసం వెదకనారంభించాడు. ఆతని దృష్టిలో సెరియనంబి అనే మహాత్ముడు పడ్డారు. ఆ మహాత్ముని సన్నిధిలో పాంచరాత్రాగమ దీక్షను పొందేరు. ఆయన ద్వారా ఎన్నో రహస్యాలను తెలుసుకున్నారు. భగవత్తత్వము బోధించే గురువు ప్రమాత, ద్వయ మంత్రమే శృతిసారము ప్రమాణము, భగవంతుడే ప్రమేయము అను మంత్రోపదేశము పొందారు. కంచిలో వరదరాజస్వామి సన్నిధిలో సన్యాస దీక్షను స్వీకరించారు. మఠాధిపతులుగా వరదరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి పూజా కార్యక్రమాలను నియమబద్ధంగా నిర్వహించే ఏర్పాట్లుచేశారు. అటు తర్వాత శ్రీరంగం శిష్యులతో చేరుకుని గోష్టీపూర్ణులు (తిరుగొట్టియార్‌నంబి)ను ఆశ్రయించి స్వయమంత్రార్థాన్ని తెలుపవల్సిందిగా అర్థించారు. గోష్ఠీపూర్ణులు ద్వయ మంత్రోపదేశం చేయడానికి ఒక షరతు పెట్టారు. రహస్యమైన ఈ మంత్రం ఎవరికీ చెప్పకూడదన్నారు. మంత్రోపదేశం పొందడానికి దండధ్వజంతో రమ్మని ఆదేశించారు. అంగీకరించిన రామానుజులవారు తన ముఖ్యశిష్యులైన కూరేశుని, దాశరధిని వెంటపెట్టుకుని వెళ్ళేరు. అది చూసి గోష్ఠీపూర్ణులు ‘ఒక్కడివే రమ్మని చెబితే శిష్యులను వెంటతెచ్చావేమిటి?’ అని ప్రశ్నించారు. ‘ఒకరు నా దండం, మరొకరు ధ్వజం’ అని రామానుజుల సమాధానం పూర్ణులకు సంతోషం కలిగించింది. మువ్వురికి ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. మంత్రార్థాన్ని వివరిస్తూ మోక్షం ప్రసాదించే ద్వయమంత్రం రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.
అయితే శ్రీరామానుజులు మోక్షం కొద్దిమందికే పరిమితం కాకూడదని, వైష్ణవమతం విస్తరించాలంటే ఆ మంత్రం సామాన్య ప్రజలందరికీ అందాలన్న సంకల్పంతో మర్నాటి ఉదయానే్న దేవాలయ గోపురం మీదనుంచి జనులంతా వినేటట్లు ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రాన్ని చెప్పి ఆ మంత్రం ప్రాముఖ్యాన్ని వివరించి నిత్యం జపించమని ఆదేశించారు. అష్టాక్షరీ మంత్ర ప్రయోజనాన్ని విన్న జనం ఆనందోత్సాహాలతో రామానుజలను ప్రశంసించారు.

-ఎ.సీతారామారావు