Others

త్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళం అందించే పుష్పం
పరిమళాన్ని ఆస్వాదించునా
అన్నం వార్చే కడవ
ఆకలి ఎరుగనా
సవ్వడితో తాళం వేసే మువ్వ
నాట్యం నాదనునా
మంచు బిందువులను
సేకరించే గాలులు
చలికి వణికి చతికిలపడునా
ఉప్పొంగే సముద్రపు కెరటాలు
దరి దారిని కాజేయునా
ఎండల్లో నీడనిచ్చే వృక్షం
సూర్యుని తాపం నాకేలననునా
జీవం పోసి జన్మనిచ్చే తల్లి
జన్మ రహస్యమెరిగి
జడిసి జాగు చేయునా
కన్నీటి వేదనల్లో శుభ్రపడే కళ్ళు
ఆవేదనల ఘడియలను కోరబోవునా
మూలానికి మూల్యం త్యాగం

- దాస్యం మాధవి, అట్లాంటా, అమెరికా, +16095161251