Others

శేష ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచభూతాల కదలికలను
ప్రాణులలో పరావర్తనం చెందించి,
పంచ ప్రాణాలను ఏకంచేసి,
గుట్టుగా బందీ చేసిన
కాలప్రవాహానికి
ఆద్యంతాలు శూన్య సమాసం

మానవ మేథో ప్రయోగ ఫలితాలను
ప్రయోజనం చిలక్కొయ్యకు
పదిలంగా వేళ్లాడదీసి,
ప్రమాణాల పంచపాలలో
జనన మరణాలను
నిక్షిప్తం చేసిన ప్రకృతికి జోహార్
అంతర్జాలాన్ని పిడికిట్లోకి లాగేసి
ఆకాశానికి అతికించాము
సాంకేతికం సవాళ్లను
గ్రహాల దాకా ఈడ్చుకెళ్లి
గమ్మత్తు రిమోట్‌తో ఆడిస్తున్నాము

రాలిపడుతున్న సమస్యలను
విశే్లషణలో కరగదీసి
కీలెరిగి వాతలు పెడ్తున్నాము
కళల చెట్టు వినోద ఫలాలను
జీర్ణించుకున్న అనుభవాలను
అరమరికలకు దూరంగా పంచుకుంటున్నాము

అత్తారింట్లో ఆస్తిపాస్తుల రాశులున్నా
అల్లుని నోట్లో శని ఉందన్నట్లు
విధి పరీక్షల్లో వేసారినా
తరుణోపాయం జుట్టు పట్టాలని
తరం తరం నిరంతరం
తండ్లాటల్లో మునిగి తేలుతున్నాము
ఇది ఇంకెన్నాళ్లు? ఎన్ని యుగాలు?
*

-ఐతా చంద్రయ్య