స్మృతి లయలు

నాన్న.. డబ్బులు తెచ్చే ఓ యంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెఢ్డింగు స్టిక్‌లో పెట్టుకుని వచ్చి ఎందు అచ్చరాలు మించింది.. పీకి వ్రేస్తున్నా.. లీక్ పెట్టి పెట్టుమీ అనేవాడు - గొప్ప ఇది చేసేవాళ్లం మేమంతా - అయ్యవారు మాత్రం (శంభుప్రసాద్ గారు) పోరా.. నాకు చూపెట్టవాకు.. పోరా అవతలికి అనేవాడు ఆ మాటల్లో ఎంత అనురాగమో, వాత్సల్యమో? నేను వీక్లీలో కలం గీకి పడేశాక - ప్రూఫ్ రీడర్ పెద్దాయన - జియోగ్రఫీలో ఆనర్సు - కప్పీ తెచ్చి - ఈ మాట ఏమిటో సారూ అనేవాడు. చేసేవాన్ని. నాదీ అదే డౌట్ - నారాయణస్వామిని పిలిచి ఇదేందో సూడుమీ అనేవాన్ని. ఎందుకు చెబుతున్నానంటే - నేరుగా సిస్టం మీద కూర్చుని వీరబాదుడు బాదే ఈ కాలం కుర్రాళ్లకి - వాళ్ల పూర్వీకులం అయిన మా కష్టం, శ్రమా తెలియవు.
సత్తార్భాయ్ బడేహూ కర్ రెడీమేడ్ షాప్ రఖో ముజ్హే కాం దేనా చోటే సకార్ ర’ అనేవాడు. దేతూన్ జరూర్ దేతూన్ లేకిన్ అబ్ జత్టన్ అని పెద్దత్త దగ్గరికి పారిపోయేవాన్ని. అదో పెద్ద గదులున్నిల్లు గజాల తలుపులు కిటికీలు వెనక వరండా - డాబా విశాలమయిన మెట్లు- మెట్ల మలుపులో గామా పహేలవాన్ ఇంట్లో నుంచి తొంగిచూసీ మునగకాయల బ్రహ్మాండమయిన చెట్టు.. సాయిబుల ఇండ్లలో మునగచెట్టు గిన్తాకు చెట్టు ‘మస్టూ’. కాని, ఓ గది చీకటిగా ఉండేది. ఆ గదిలో గ్రామఫోను - పెద్దది పెట్టేడు. మా అత్తకి అనుమానం దెయ్యాలున్నాయని - ఆసు మ ఇంచ్‌పేటలో మీకు గుమ్మానికి రక్షరేకులు ఎడాపెడా కొట్టని ఇండ్లు వుండవు. ఆఫ్రికన్ షాప్ అని బోడెమ్మ సెంటర్‌లో - పోలీసు స్టేషన్ మా స్కూలుకి దగ్గరగా వుండేది - అప్పుడు తెలియదు కాని పెద్దయ్యాక జిఎంహెచ్ అజ్జేకా దాని ఆజ తెల్సింది. అదో డిపార్టుమెంటల్ స్టోరు - అదో సూపర్‌మార్కెట్ టైపు. విదేశీ సరుకులు దొరికేవి.. లోపల ఒక మ్యూజియంలాగ బ్లేడు గదులు - అక్కడ మా మామాసురుడు అత్తర్లు సెంట్లు - జవ్వాజి వగైరా అలాగే గ్రామఫోను రికార్డులు కొనేవాడు - మా పెద్దమామయ్యకి విశాఖపట్నం సుబ్బారావు మామకి హిందీ సినిమాల పిచ్చి - పిచ్చి అన్న మాటకి వీళ్ల యావ చూస్తే అర్థం అయిపోతుంది అనేవాళ్లు మా చిన్నాన్లు. గట్టిగా కాదు- చిన్న చిత్రం బావమరదుల మధ్య వైరా ప్రేమకి - అరచెయ్యి మూడు వ్రేళ్లు మడిచిపెట్టుకొని తరజని దానిప్రక్క వేలు కలిపి తుపాకీ లాగ పెట్టి - నువ్వు ఇలాగే పెట్టు అనేవాడు మరది.. (మామయ్య) నువ్వూ ఇలాగే పెట్టుకన్నా (మా బుచ్చినాన్నంటే చితడ పెట్టి ముందుకు జాపు అని - మామా చెయ్యిట్టి లాగి రెండువ్రేళ్లతో చిన్ననాన్న రెండు వ్రేళ్లని కొడితే - ఫినిష్ - గిర్రున కన్నీళ్లు తిరిగేవి పాపం. నువ్వు కొట్టుకన్నా రెండు ఛాన్సులు తీసుకో అనేవాడు పె.మా. - ఇంటికి పోయి మా అమ్మ మీద విరుచుకు పడేవాళ్లు మా అంకుల్స్. వదినా విను ఆ సూరిబ్బు వస్తే వాడికి కాఫీ ఇవ్వొద్దు. అట్లకాడ కాల్చి వాత పెట్టు - లేదా నేను రేపు అన్నం తినను - ఇవాళ తినేవారన్నమాట. ఛాన్స్ దొరికితే చాలు మా సత్యం అత్తా ఇక్కడ అమ్మ దగ్గర వ్రాలేది. వదినా - సూరిబాబు పెద్దవాడైతే అంక దణ్ణం పెడతాగాని - బాబుని (మా నాన్నగారిని) ఎత్తుకుని గిరగిర తిప్పి ఇలా పెట్టేశాడోమారు. ఉత్త వస్తాదు బాపతు. దొంగ కక్కకట్టు - ఈ తిట్టు శ్రీకాకుళం తిట్టు. మా మామ్మ పుట్టింటివారు చిక్కోలె - కాస్సాల (కాసీ సోమయాజుల)వారు. అమ్మ బిజీ.. నాన్న ఆఫీసుకి పోయి డబ్బులు తెచ్చే ఓ యంత్రం. అయిన వాళ్లంతా మా అమ్మని అమ్మమ్మనీ సతాయించే సరుకే. మా గురించి హూ కేర్స్ / నేను ఐదోక్లాసు లేదు వాడు మూడో క్లాసు లేదు - ఛాన్సు దొరికితే మా అమ్మ వైజాగ్ వాళ్ల ఇంకో అన్నయ్య దగ్గరికి తీసుకుపోయేది.
మిలిటరీ కాంట్రాక్టులు చేసేవాడు మా సుందరం మామయ్యా - వాళ్లింట్లో కుక్కలు ఉండేవి. ఓ గుర్రంబండీ - అది ఆ రోజుల్లో స్టేటస్ సింబల్ అన్నమాట. మరో ఫోర్డు కారు. బెజవాడలో గాలివాన వచ్చింది. నాకు టైఫాయిడ్ ఫీవర్. మా మామయ్య రిచ్ ఫెలో. ఇన్‌ఫ్లుయెన్స్ గలవాడు. పైగా మా తమ్ముడు చొంగదాసు గాని తెల్లగా ఉడకబెట్టి కోసిన బంగాళాదుంప రంగులో ఉండేవాడు. వాణ్ణి పెంచుకోవాలని ఫుల్లుమూనులాగా బూరబుగ్గలతో వాణ్ణి పెంచుకోవాలని వాళ్ల ఆశట. ముఖర్జీ అని ఓ రైల్వే డాక్టర్ ఉండేవాడుట. ఆయన మొట్టమొదటి టెర్రామైసిన్ ఇంజక్షన్ - ఇచ్చాడుట. బ్రతికేను అని చెప్పాలా/ మళ్లీ అమ్మ వెళ్లిపోయింది. నేనూ తమ్ముడూ విశాఖ దొండపర్తి మామయ్య లోగోల్లో. అదో దివాణం - నాకు నాన్‌రొట్టె పాలు.. రెస్టు. షరా మామూలే. వైజాగ్ ఓల్డ్ టవున్‌లో మెయిన్‌రోడ్డు మీద విక్టోరియా రాణి పార్కు ప్రాంతంలో మా సత్యం అత్త ఉండేది. మా అమ్మను ఒక్కోసారి అమ్మ అనేది చనువు ప్రేమా అవీ ఇవీ అన్నీ - నాకు తెలియని మా తాతగారు విజయనగరం - లక్కపందిరివారి వీధి - కోట కోనేరు - నే పుట్టినప్పటి స్టోరీ - ఇవన్నీ చెప్పేదామె. జర్నలిస్టు జరగన్‌లో చెప్పాలంటే నా కాంటాక్టు - సోర్సు అదీ ఆమె.
ఇక్కడో సంగతి చెప్పాలి. టేపురికార్డర్లు - కెమెరాలు, డైరీలు ఇలా ఎన్ని వున్నా - మనిషి గుండె లోపల -మరో ఘర్షణ మరో దడ అయాచితంగా ఉంటేనే - ఫాక్ట్స్‌కన్నా ఎక్కువగా స్మృతి చిత్రాలు ఏర్పడిపోతాయి. ఏదో పురిటినొప్పులై ఒకనాడు ఆ జ్ఞాపక చిత్రాలు అక్షర రూపుకడతాయి. గాలి బొమ్మలే పంచభూత యవనిక మీద కనబడితేనే..

(ఇంకా బోలెడుంది)

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com