Others

ఆ కిటికీ తలుపుల సాక్షిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిందర వందరగా పుస్తకాలు
తెరచుకొని కొన్ని, మూసికొని కొన్ని
అక్కడక్కడ దొంతరలుగా
మరికొన్ని ఒంటరిగా
రకరకాల పుస్తకాలు
తిరగేస్తూ కొందరు, వల్లెవేస్తూ ఇంకొందరు
ఎందరో రకరకాల వ్యక్తులు
వస్తున్నారు పోతున్నారు
ఏవేవో సమాలోచనలు, సమావేశాలు
జరుగుతున్నాయ
నడుం వాలుస్తూ కొందరు
పచార్లు చేస్తూ ఇంకొందరు
గంటలు గంటలు చర్చలు
వాదోపవాదాలు
ఎంతకీ కొలిక్కిరానివి
కథ కంచికి చేరనివి
రాత్రుళ్లు రాత్రుళ్లు
పగళ్లు పగళు ల
రాత్రీ పగళ్లు
పడుకోకుండా,
విశ్రాంతి లేకుండా
చర్చోపచర్చలు
నడుస్తూనే ఉన్నాయ
ఆ గదిలో...
ఆ గది తలుపులు
మూసివేయబడుతున్నాయ
తెరువబడుతున్నాయ
ఎన్నో పాదాలు
అవతలకి ఇవతలకి
ప్రవహిస్తూనే ఉన్నాయ
ప్రచండ భానుని ప్రతాపంతో
ధూమ్రపాతం
హోరుగాలి దుమారంతో
వర్షపాతం
చల్లని చలిగాలి రొదతో
హిమపాతం
ఎన్ని కాలాలు మారినా
ఆ గది కిటికీ తలుపులు మాత్రం
మూయబడలేదు
అన్ని కాలాలకు సాక్షిగా
ఆ కిటికీ తలుపులు...

కానీ
నేడు అందంగా
ఎల్‌ఇడి తెరపై ఇంటర్నెట్‌లో
ప్రపంచాన్ని బల్లపై పెట్టుకొని
సమస్త సమాచారాన్ని గుప్పెట్లో తీసుకొని
ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, వాట్సప్‌లో
విశ్వంలో అందరితోనూ
సంబంధత్వంతో
కార్పొరేట్ హంగులతో
అందంగా అలంకృతమైంది
అదే గది
ఒంటరిగా...

- ఆర్. బాలకృష్ణ 9440143488