Others

మహోన్నత సృష్టి నర్తనశాల (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీరామారావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి చాలు..
ఈ ముగ్గురూ ఉంటే. ఒకరిని మించి ఒకరు పోటీపడి, మనల్ని ఆహ్లాదంలో ముంచి తేలుస్తారు. వీరికి తోడు శోభన్‌బాబు, ఎల్.విజయలక్ష్మి, సంధ్య, రేలంగి వంటి అసమాన ప్రతిభగల నటులు మరోవంక మనల్ని అలరిస్తారు.
అతిరథ మహారథులు అనదగిన నటీనటులు నటించిన చిత్రరాజం ‘నర్తనశాల’. నాకు అమితంగా నచ్చిన చిత్రమిది. ఎన్టీరామారావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి చాలు.. ఈ ముగ్గురూ ఉంటే. ఒకరిని మించి ఒకరు పోటీపడి, మనల్ని ఆహ్లాదంలో ముంచి తేలుస్తారు. వీరికి తోడు శోభన్‌బాబు, ఎల్.విజయలక్ష్మి, సంధ్య, రేలంగి వంటి అసమాన ప్రతిభగల నటులు మరోవంక మనల్ని అలరిస్తారు. ఇక పాటల సంగతికి వస్తే-సుసర్ల దక్షిణామూర్తిగారు అమరులతో చేయి కలిపి- ప్రేక్షకులు అమర లోక సంగీతాన్ని వినేలా చేశారు. నరవరా ఓ కురువరా, జననీ శివకామినీ, సలలిత రాగసుధారస సారం, జయగణ నాయక విఘ్నవినాయక, శీలవతి నీగతి ఈ విధిగా మారెనా, సఖియా వివరించవే- వగలెరిగిన చెలునికి నా కథ, ఎవ్వరికోసం ఈమందహాసం ఒకపరి వివరించవే, దరికి రాబోకురాబోకు రాజా, ఏనుంగు నెక్కి వంటి పద్యాలు మనకూ ముఖ్యంగా మన మనసుకి సేదని చేకూరుస్తాయి.
కథ విషయానికి వస్తే.. విరాటపర్వం- పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం పూర్తిచేసే సమయంలో విరటుని కొలువులో ఆశ్రయం పొందినపుడు జరిగిన సంఘటనలు ఉత్తర గోగ్రహణం.
ఇన్ని చెప్పి మహోన్నత దర్శకుడు కమలాకర కామేశ్వరరావుగారి గురించి చెప్పకపోవటం మహా అపరాధం. మనకు కనిపించని దేవుళ్ల రూపాలను మనకు చూపించి, మనలో దైవచింతనను పెంపొందించి, మనల్ని ఆధ్యాత్మికత వైపుకి సంపూర్ణంగా మళ్లించిన గొప్ప వ్యక్తి శ్రీ కమలాకర కామేశ్వరరావుగారు. ఇందరి మహోన్నత సృష్టి నర్తనశాల. నాకు అపరమితంగా నచ్చిన చిత్రం.

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు